ఇంత ఘోరంగా ఆడుతారా?: పాక్‌పై నిప్పులు
- సోషల్ మీడియాలో తమ జట్టును కడిగిపారేస్తున్న నెటిజన్లు
Even Wahab Riaz is more useless than Madhuri's dupatta. pic.twitter.com/XlWNYJQDls
— Maan Rehman (@maanrehman) June 4, 2017
ఇక ఫాస్ట్ బౌలర్ వహబ్ రియాజ్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. అతన్ని పాక్ నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. ప్రధానంగా అతన్నే టార్గెట్ చేసుకుని ఎక్కువగా విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాక్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ అయిన రియాజ్ భారత్ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అతను 8.4 ఓవర్లు వేసి 87 పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌ను జీర్ణించుకోలేకపోతున్న పాక్ నెటిజన్లు అతన్ని తీవ్రంగా దూషిస్తూ ఎండగడుతున్నారు. పాక్ నెటిజన్లు తమ క్రికెటర్లను ఎంత దారుణంగా దూషిస్తున్నారో పాక్ చానెల్ ఒకటి వెల్లడించింది. పాక్ నెటిజన్ల ఆగ్రహాన్ని, పోస్టులను ఒకచోట గూడిగుచ్చి ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనం ఇప్పుడు వైరల్‌గా మారింది.