పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. జట్టు ఎంపిక విషయంలో తనకు నచ్చినట్లుగా వ్యవహరించి.. పాక్ భారీ మూల్యం చెల్లించేలా చేశాడని అభిప్రాయపడ్డాడు.
అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితాలే చూడాల్సి వస్తుందని ఘాటుగా విమర్శించాడు. గతంలో పాక్ జట్టును విమర్శించిన రియాజ్.. ఇప్పుడు తన పనితనాన్ని ఎలా సమర్థించుకుంటాడోనంటూ సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ కనీసం సూపర్-8 కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో ఫేవరెటిజం, బంధుప్రీతి చూపడం వల్లే కొంపమునిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ పాక్ చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ తీరును తప్పుబట్టాడు. ‘‘వహాబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్... ఇద్దరూ పాకిస్తాన్ జట్టును విమర్శించిన వాళ్లే.
ఏ టీవీ చానెల్‌లో అయితే వీళ్లిద్దరూ ఈ పని చేశారో.. ఇప్పుడు అదే చానెల్‌లో వీళ్లను విమర్శిస్తున్నారు. ఆనాడు అలా మాట్లాడిన వాళ్లలో ఒకరు ఇప్పుడు చీఫ్ సెలక్టర్(రియాజ్).. మరొకరు తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు(ఆమిర్).
మహ్మద్ ఆమిర్ అప్పుడు నాతో ఉన్నాడు కాబట్టి.. అతడిని జట్టుకు ఎంపిక చేస్తాననుకోవడం సరైందేనా?! ఇప్పుడు అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉన్నాడు.
కాబట్టి తను నా దగ్గరికి వచ్చి.. ‘వీరూ, జాక్(జహీర్ ఖాన్).. మీరిద్దరూ రండి. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను అవకాశం కల్పిస్తా’ అంటే ఎలా ఉంటుంది. ఆమిర్ పట్ల రియాజ్ చేసింది కూడా ఇలాగే ఉంది’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశాడు.
కాగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మహ్మద్ ఆమిర్ టీ20 ప్రపంచకప్-2024కు ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అనూహ్య రీతిలో అతడు వరల్డ్‌కప్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు.
ఇమాద్ వసీం సైతం ఇలాగే ఆఖరి నిమిషంలో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ఎంపికకు వహాబ్ రియాజే కారణమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
కాగా మహ్మద్ ఆమిర్ వరల్డ్‌కప్-2024లో ఏడు వికెట్లు తీయగలిగాడు. అయితే, అమెరికాతో సూపర్‌లో పద్దెనిమిది పరుగులు సమర్పించుకుని పాక్ ఓటమికి కారణమయ్యాడు ఈ లెఫ్టార్మ్ పేస్ బౌలర్.
చదవండి: కోట్లకు కోట్లు తీసుకుంటారు.. భార్యల్ని తీసుకెళ్లడం బాగా అలవాటైంది!
Comments
Please login to add a commentAdd a comment