అబ్బాయికి... బాబాయ్ అండ
ప్రవక్త జీవితం
ప్రేమ, వాత్సల్యం నిండిన మాటలు ముహమ్మద్ ప్రవక్త(స)ను కదిలించాయి. ధర్మమార్గంలో ఒకదాని తర్వాత మరొకటిగా అనేక అవాంతరాలు. వీటన్నిటినీ అధిగమించి ముహమ్మద్ ప్రవక్త తన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతారా? లేక వయసు పైబడిన బాబాయి ముఖం చూసి ఉద్యమాన్ని విరమించుకుంటారా? ప్రపంచం విశ్వాస కాంతితో పునీతమై, మిరుమిట్లు గొలుపుతుందా? అంధకారంలో కూరుకుపోతుందా? కాలం స్తంభించి, యావత్ సృష్టి అవాక్కయి, ముహమ్మద్ ప్రవక్త సమాధానం కోసం ఎదురుచూస్తోంది.
‘బాబాయీ! దైవసాక్షిగా చెబుతున్నా. ఒకవేళ ఈ అవిశ్వాసులు కుడి చేతిలో చంద్రుణ్ణి, ఎడమ చేతిలో సూర్యుణ్ణి తెచ్చిపెట్టి, నా పని మానుకోమన్నా నా ధర్మ ప్రచారాన్ని మానుకోను. నేను తలపెట్టిన (దైవం నాకు అప్పగించిన) కార్యమైనా పరిపూర్ణం కావాలి. లేక ఈ మార్గంలో నా ప్రాణమైనా పోవాలి’ అని ముహమ్మద్ ప్రవక్త అన్నారు స్థిరనిశ్చయంతో..
అబూ తాలిబ్ ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. ఎంతటి దృఢనిర్ణయం! తన జాతి తనతో ఎలా ప్రవర్తిస్తుందన్న బెంగా లేదు. కళ్ళ ముందు అంతటి ప్రమాదాన్ని చూస్తూకూడా కించిత్ బెదురు లేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం తనను తాను త్యాగం చేయాలన్న ఆ మనోైధర్యానికి అబూ తాలిబ్ కదిలిపోయారు. ఆయన ధైర్యానికీ, మనో నిబ్బరానికీ అబూ తాలిబ్ ఎంతో ప్రభావితులయ్యారు.ముహమ్మద్ (స) చిన్నగా బయటికి నడిచారు. ఆయన కళ్ళలో సన్నని కన్నీటి ధార. ‘బాబాయి అండ కూడా లేకుండా పోతుందా?’ ఆయన మనసు బాధతో బరువెక్కింది.అంతలో... ‘బాబూ... ముహమ్మద్...!’ అంటూ అబూ తాలిబ్ పిలుపు.
ప్రవక్త వెనుదిరిగి చూశారు. ఆయన కళ్ళలో సన్నని కాంతి. రెండే అంగల్లో బాబాయిని సమీపించారు. ‘బాబూ..! నువ్వు ఏం చేయదలుచుకున్నావో నిరభ్యంతరంగా చేసుకో. నీ ధర్మప్రచారాన్ని కొనసాగించుకో. నా బొందిలో ప్రాణమున్నంత దాకా నేను నీకు తోడుగా ఉంటా’ అన్నారు అబూ తాలిబ్. బాబాయి నోట ఈ మాట వినగానే ఆయన మనసు ఆనంద తరంగాల్లో ఓలలాడింది.
అబ్బాయి సహాయం కోసం అబూ తాలిబ్ నడుం కట్టారు. తమ వారందరినీ సమావేశపరిచారు. మక్కాలోని ఖురైష్ తెగల వారంతా ముహమ్మద్ వెంట పడ్డారనీ, వాళ్ళ బెదిరింపులు ఒక స్థాయిని దాటి ‘ముహమ్మద్‌ను చంపుతాం’ అనే దాకా వెళ్ళిందనీ చెప్పారు. ‘ముహమ్మద్ మాటలతో, అతని ప్రచారంతో వారికి విభేదం ఉంటే, దాన్ని వారు తిరస్కరించవచ్చు. అంతేగాని ముహమ్మద్‌ను తమకు అప్పగించమనీ, అతణ్ణి చంపేస్తామనీ అనే అధికారం వారికెలా ఉంటుంది? మనమంతా ఏకతాటిపై నిలిచి వాళ్ళ ఆగడాలను ఎదుర్కోవాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలుసుకుందామనే మిమ్మల్ని సమావేశ పరిచాను’ అన్నారు అబూ తాలిబ్ గంభీరంగా. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం)
ఒక్క అబూలహబ్ తప్ప, అందరూఅబూతాలిబ్ మాటలతో ఏకీభవించారు.ముహమ్మద్ (స) నుఒంటరిగా వదిలిపెట్టబోమని ప్రకటించారు. ఇన్నాళ్ళూసహించి ఊరుకున్నాం. ఇకసహించే ప్రసక్తేలేదు’. అన్నారందరూ ముక్తకంఠంతో..అబూలహబ్ మాత్రం కుటుంబ సభ్యులతో విభేధించి శతపక్షంలో చేరిపొయ్యాడు.ఈ విషయం ముహమ్మద్ కు చెబుదామని చాలా సంతోషంగా బయలుదేరారుఅబూతాలిబ్ . కాని ఆయన ఇంట్లోలేరు. ఎటువెళ్ళారో తెలియదన్నారు ఇంట్లోవాళ్ళు. అబూతాలిబ్ మనసు కీడుశంకించింది. దుర్మార్గులు అబ్బాయికి ఏమైనా కీడుతలపెట్టారేమో అని తీవ్రఆందోళన చెందారు. వెంటనే ఆయనయువకులందర్నీ సమీకరించి, కరవాలాలు తీసుకొని తనవెంట బయలు దేరమన్నారు. క్షణాల్లో యువకులంతా ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. అబూతాలిబ్ సూచన మేరచుఅవి కనబడకుండా చొక్కాల్లోపల దాచుకున్నారు. అబూతాలిబ్ నేరుగా కాబాైవపుదారితీశారు. దారిలో ప్రవక్త పెంపుడు కొడుకు ైజద్ బిన్ హారిసా (ర) ఎదురు పడి ఏమిటీ విషయమని ఆరా తీశారు. ’ముహమ్మద్ (స) హంతకుల నుండి ప్రతీకారం తీర్చుకోవడాని కని బదులిచ్చారు అబూతాలిబ్ . ’అదేమిటీ..ఆయన నిక్షేపంగా కాబాలో ఉన్నారు. నేనిప్పుడు ఆయన దగ్గరినుండే వస్తున్నాను’. అన్నారు ైజద్
జద్ మాటలతో అబూతాలిబ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆయనమనసుకు ప్రశాంతత చేకూరింది. అయినా కాబాలయానికి వెళ్ళి అబ్బాయిని కళ్ళారా చూసుకోవాలని ముందుకు సాగారు. అకస్మాత్తుగా అబూతాలిబ్ బనూహాషిం యువకుల్ని వెంటబెట్టుకొని రావడం చూసి అవిశ్వాసులు ఆశ్చర్యపొయ్యారు. ప్రశ్నార్ధకంగా వాళ్ళంతా ఒకరిముఖాలొకరు చూసుకోవడం చూసి, అబూతాలిబ్ ’ ఏమిటి ఆశ్చర్యపోతున్నారు? నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలుసా?’ అనిప్రశ్నించారు.’దేవుని తోడు. మాకసలు ఏమీ తెలియదు.’ అన్నారువారంతా ముక్తకంఠంతో..అప్పుడు అబూతాలిబ్ విషయం వివరించి, యువకులైవపు ైసగ చేశారు. వెంటనే బనూహాషిం యువకిశోరాలు తాము లోపల దాచినఆయుధాలు బయటికి ప్రదర్శించారు.అప్పుడుఅబూతాలిబ్ ,’ ైదవసాక్షిగా చెబుతున్నాను. మీరుగనక మా ముహమ్మద్ కు హాని కలిగించి ఉన్నట్లయితే మిమ్మల్నికత్తికో కండగా కోసికుక్కల పాలు చేసేవాణ్ణి. ఒక్కణ్ణికూడా ప్రాణాలతో వదిలేవాణ్ణికాదు. మాప్రాణాలు పోయినా సరే, చివరి రక్తపుబొట్టువరకూమీతో పోరాడేవాణ్ణి’. అన్నారుయువకుల ఖడ్గప్రదర్శన, అబూతాలిబ్ ఉగ్రరూప వాగ్ధాటిని చూసి అవిశ్వాసుల గుండెలు జారిపొయ్యాయి. బిత్తరపోయి ఒకరిముఖాలొకరుచూసుకోవడం ప్రారంభించారు.
- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం)