Sikandar Raza Becomes the Fastest to Complete 4000 Runs in Terms of Innings - Sakshi
Sakshi News home page

#CWCQualifiers2023: చరిత్ర సృష్టించిన సికిందర్‌ రజా.. 23 ఏళ్ల రికార్డు బద్దలు!

Published Thu, Jun 29 2023 4:22 PM | Last Updated on Thu, Jun 29 2023 5:06 PM

Sikandar Raza becomes the fastest to complete 4000 runs in terms of innings - Sakshi

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2023లో క్వాలిఫియర్స్‌లో జింబాబ్వే స్టార్‌ ఆల్‌రౌండర్‌ సికిందర్‌ రజా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.  క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో రజా 42 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో సికిందర్‌ రజా ఓ అరుదైన రికార్డును సాధించాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రజా నిలిచాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో 18 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఈ రికార్డును రజా నమోదు చేశాడు. రజా కేవలం 127 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు జింబాబ్వే దిగ్గజం గ్రాంట్‌ ఫ్లవర్‌ పేరిట ఉండేది.

2000లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో  గ్రాంట్‌ ఫ్లవర్‌ ఈ ఘనత సాధించాడు. 128 ఇన్నింగ్స్‌లో ఫ్లవర్‌ ఈ రికార్డును అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో 23 ఏళ్ల ఫ్లవర్‌ రికార్డును రజా బ్రేక్‌ చేశాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన రజా.. 86.67 సగటుతో 260 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ అద్భుత సెంచరీ కూడా ఉంది.
చదవండి#SeanWilliams: హ్యాట్రిక్‌ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement