దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో భాగంగా మహిళల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం రేసులో భారత స్టార్ స్మృతి మంధాన నిలిచింది. శుక్రవారం ఐసీసీ ఈ విభాగంలో నలుగురు క్రికెటర్లను నామినేట్ చేసింది.
భారత్ నుంచి స్టార్ ఓపెనర్ స్మృతి రెండుసార్లు (2018, 2021), జులన్ గోస్వామి (2007) ఒకసారి ఈ పురస్కారం గెల్చుకున్నారు. గురువారం ప్రకటించిన టి20 ‘మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు కూడా స్మృతి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఏకైక భారత క్రికెటర్
ఇక పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, ఇంగ్లండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా సహా న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్ టిమ్ సౌథీ ఈ ప్రతిష్టాత్మక పురస్కార రేసులో నిలిచారు. భారత పురుషుల క్రికెట్ జట్టు నుంచి ఒక్కరు కూడా ఈ లిస్టులో లేరు. దీంతో భారత్ నుంచి రేసులో నిలిచిన ఏకైక ప్లేయర్‌గా మంధాన నిలిచింది.
ఇది కూడా చదవండి: Ranji Trophy: తదుపరి మ్యాచ్ ఆంధ్రతో
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అస్సాం జట్టుతో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ముగిసిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి రోజు విజయానికి మరో 22 పరుగులు చేయాల్సిన హైదరాబాద్ శుక్రవారం ఐదు బంతుల్లో కేవలం మూడు పరుగులు జోడించి మిగిలిన ఒక వికెట్‌ను కోల్పోయింది.
ఓవర్‌నైట్ స్కోరు 228/9తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 61.5 ఓవర్లలో 231 పరుగులవద్ద ఆలౌటైంది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (158 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. శుక్రవారం ఉదయం రియాన్ పరాగ్ ఓవర్ వేయగా... తన్మయ్ నాలుగు బంతులు ఆడి మూడు పరుగులు చేసి సహచరుడు కార్తికేయ (3 బంతుల్లో 1)కు ఐదో బంతికి స్ట్రయికింగ్ ఇచ్చాడు. రియాన్ వేసిన ఐదో బంతికి కార్తికేయ వికెట్లముందు దొరికిపోయాడు.
దాంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు తెరపడగా... అస్సాం అద్భుత విజయాన్ని అందుకుంది. తమిళనాడుతో తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన హైదరాబాద్... రెండో మ్యాచ్‌లో ముంబై చేతిలో ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓడిపోయింది. జనవరి 3 నుంచి విశాఖపట్నంలో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది.
సంక్షిప్త స్కోర్లు
అస్సాం తొలి ఇన్నింగ్స్: 205; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 208; అస్సాం రెండో ఇన్నింగ్స్: 252; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (61.5 ఓవర్లలో) (తన్మయ్ అగర్వాల్ 126 నాటౌట్, భావేశ్ సేథ్ 41, రాహుల్ బుద్ధి 28, రియాన్ పరాగ్ 4/93, స్వరూపం 2/49, గోకుల్ శర్మ 2/23).
చదవండి: క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు
Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!
Comments
Please login to add a commentAdd a comment