PBKS Vs LSG: పంజాబ్‌దే పైచేయి | Punjab Kings beat Lucknow Super Giants by 2 wickets | Sakshi
Sakshi News home page

IPL 2023 PBKS Vs LSG: పంజాబ్‌దే పైచేయి

Published Sun, Apr 16 2023 12:36 AM | Last Updated on Sun, Apr 16 2023 8:33 AM

Punjab Kings beat Lucknow Super Giants by 2 wickets - Sakshi

లక్నో: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది. చివరి వరకు మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 2 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించగా, కైల్‌ మేయర్స్‌ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించాడు. స్యామ్‌ కరన్‌ 3 వికెట్లు పడగొట్టగా, రబడకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్‌ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు సాధించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సికందర్‌ రజా (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేయగా, మాథ్యూ షార్ట్‌ (22 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. చివర్లో షారుఖ్‌ ఖాన్‌ (10 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు జట్టును గెలిపించాయి. రవి బిష్ణోయ్, యుద్‌వీర్‌ సింగ్, మార్క్‌వుడ్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. భుజం నొప్పితో ఈ మ్యాచ్‌కు శిఖర్‌ ధావన్‌ దూరం కాగా, స్యామ్‌ కరన్‌ పంజాబ్‌ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు.  

స్కోరు వివరాలు  
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) (సబ్‌) ఎలిస్‌ (బి) అర్షదీప్‌ 74; మేయర్స్‌ (సి) హర్‌ప్రీత్‌ సింగ్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 29; హుడా (ఎల్బీ) (బి) రజా 2; కృనాల్‌ (సి) షారుఖ్‌ (బి) రబడ 18; పూరన్‌ (సి) షారుఖ్‌ (బి) రబడ 0; స్టొయినిస్‌ (సి) జితేశ్‌ (బి) కరన్‌ 15; బదోని (నాటౌట్‌) 5; గౌతమ్‌ (సి) రజా (బి) కరన్‌ 1; యు«ద్‌వీర్‌ (సి) షారుఖ్‌ (బి) కరన్‌ 0; బిష్ణోయ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–53, 2–62, 3–110, 4–111, 5–142, 6–150, 7–154, 8–154. బౌలింగ్‌: షార్ట్‌ 2–0–10–0, అర్షదీప్‌ 3–0–22–1, రబడ 4–0–34–2, స్యామ్‌ కరన్‌ 4–0–31–3, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2–0–10–1, రజా 2–0–19–1, చహర్‌ 3–0–28–0.  

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: అథర్వ (సి) అవేశ్‌ (బి) యుద్‌వీర్‌ 0; ప్రభ్‌సిమ్రన్‌ (బి) యుధ్‌వీర్‌ 4; షార్ట్‌ (సి) స్టొయినిస్‌ (బి) గౌతమ్‌ 34; హర్‌ప్రీత్‌ సింగ్‌ (సి) (సబ్‌) ప్రేరక్‌ (బి) కృనాల్‌ 22; రజా (సి) స్టొయినిస్‌ (బి) బిష్ణోయ్‌ 57; కరన్‌ (సి) కృనాల్‌ (బి) బిష్ణోయ్‌ 6; జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) వుడ్‌ 2; షారుఖ్‌ (నాటౌట్‌) 23; హర్‌ప్రీత్‌ బ్రార్‌ (సి) పూరన్‌ (బి) వుడ్‌ 6; రబడ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో 8 వికెట్లకు) 161.  
వికెట్ల పతనం: 1–0, 2–17, 3–45, 4–75, 5–112, 6–122, 7–139, 8–153. బౌలింగ్‌: యుద్‌వీర్‌ 3–0–19–2, అవేశ్‌ 3–0–24–0, మార్క్‌వుడ్‌ 4–0–35–2, గౌతమ్‌ 4–0–31–1, కృనాల్‌ 3–0–32–1, రవి బిష్ణోయ్‌ 2.3–0–18–2.   

ఐపీఎల్‌లో నేడు 
ముంబై VS  కోల్‌కతా (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) 
గుజరాత్‌ VS రాజస్తాన్‌ (రాత్రి గం. 7:30 నుంచి) 

స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement