PBKS Vs LSG: Fans Cant Keep Calm After Gambhir Grins Like A Cheshire Cat In LSG Dominant Win - Sakshi
Sakshi News home page

IPL 2023 PBKS Vs LSG: హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు! ఇక చాలు గౌతీ! వీడియో వైరల్‌

Published Sat, Apr 29 2023 1:09 PM | Last Updated on Sat, Apr 29 2023 1:28 PM

FANS cant keep calm after Gambhir grins like a Cheshire cat in LSG - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మరో విజయం సాధించింది. మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో లక్నో గెలుపొం‍దింది. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండో స్థానానికి చేరుకుంది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించింది.

లక్నో బ్యాటర్లలో మార్కస్‌ స్టోయినిష్‌(72), కైల్‌ మైర్స్‌(54), పూరన్‌(45) విధ్వంసం సృష్టిం‍చారు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. 

ఎట్టకేలకు నవ్విన గౌతం గంభీర్‌
ఇక ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ ఎట్టకేలకు నవ్వాడు. గౌతీ తన మైదానంలో తన హావభావాలను వ్యక్తం చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ పంజాబ్‌పై లక్నో విజయం సాధించడంతో గంభీర్‌ ఖుషీగా ఉన్నాడు. 

పంజాబ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేష్‌ శర్మ ఔటైన వెంటనే గంభీర్‌ నవ్వుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను  లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియో సినిమా సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఓ యూజర్‌ స్పందిస్తూ.. హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు, ఇక చాలు గౌతీ అంటూ కామెంట్‌ చేశాడు.
చదవండి: IPL 2023: అంత మంచి క్యాచ్‌ పట్టి అలా చేశావు ఏంటి? వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement