
PC: TWITTER
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(72), కైల్ మైర్స్(54), పూరన్(45) విధ్వంసం సృష్టించారు.
అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో యువ ఆటగాడు అథర్వ తైదే 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో యాష్ ఠాకూర్ నాలుగు వికెట్లు, నవీన్ ఉల్ హాక్ మూడు, బిష్ణోయ్ రెండు, స్టోయినిష్ ఒక వికెట్ సాధించారు.
మార్కస్ స్టోయినిష్‌కు గాయం
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన లక్నో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్.. దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో వేసిన స్టోయినిష్.. ఆదిలోనే కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఓ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. అనంతరం మూడో ఓవర్ వేసిన స్టోయినిష్ బౌలింగ్‌లో అథర్వ తైదే స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో ఎడమ చూపుడు వేలికి గాయమైంది.
చదవండి: IPL 2023 LSG VS PBKS: ఆ నిర్ణయమే పంజాబ్ కొంపముంచిందట..!
దీంతో మైదానంలో నొప్పితో అతడు విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో చికిత్స అందినించప్పటికీ ఫలితం లేకపోయింది. ఆఖరికి స్టోయినిష్ మైదానం వీడాడు. వెంటనే అతడిని స్కానింగ్ తరిలించారు. ఇదే విషయాన్ని స్టోయినిష్ కూడా తెలిపాడు. "ప్రస్తుతానికి బాగానే ఉంది. స్కానింగ్‌కు వెళ్లాను. ఆ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాము" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో స్టోయినిష్ పేర్కొన్నాడు. అయితే స్టోయినిష్ గాయం తీవ్రమైనదిగా తేలితే మాత్రం అతడు తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.
చదవండి: PBKS VS LSG: రెచ్చగొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు, ఆతర్వాత..!