photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మొహాలి వేదికగా నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే..
- ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక టీమ్ స్కోర్ (257-5). అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఆర్సీబీ (2013లో పూణేపై 263-5) పేరిట ఉంది.
- ఓ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక బౌండరీల రికార్డు (41).. లక్నో ఈ మ్యాచ్‌లో- 41 (27 ఫోర్లు, 14 సిక్సర్లు). అత్యధిక బౌండరీలు రికార్డు ఆర్సీబీ పేరిట ఉంది. 2013లో పూణేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 42 (21 ఫోర్లు, 21 సిక్సర్లు) బౌండరీలు సాధించింది.
- ఓ మ్యాచ్‌లో రెండో అత్యధిక బౌండరీల రికార్డు (67).. పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో 67 (45 ఫోర్లు, 22 సిక్సర్లు, 458) బౌండరీలు నమోదయ్యాయి. 2010 సీజన్‌లో సీఎస్‌కే వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌లో అత్యధికంగా 69 బౌండరీలు (39 ఫోర్లు, 30 సిక్సర్లు) నమోదయ్యాయి.
- ఓ సీజన్‌లో అత్యధిక 200 ప్లస్ స్కోర్ల రికార్డు (20).. ప్రస్తుత సీజన్‌లో 20 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. 2022లో 18, 2018లో 15 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి.
- అత్యధిక బౌలర్ల వినియోగం (9)- పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 9 మంది బౌలర్లను ప్రయోగించింది. 2016లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 మంది బౌలర్లను మార్చింది.
Comments
Please login to add a commentAdd a comment