జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే రెండు సిక్సర్లు బాదిన యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సికందర్ బౌలింగ్‌లో తొలి బంతి నో బాల్ కాగా.. ఆ బంతిని యశస్వి సిక్సర్‌గా మలిచాడు. ఆతర్వాతి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఆ బంతిని కూడా స్టాండ్స్‌లో పంపాడు. నో బాల్‌తో లభించే అదనపు పరుగుతో కలుపుకుని తొలి బంతికి మొత్తం 13 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలా తొలి బంతికే 13 పరుగులు వచ్చిన దాఖలాలు లేవు.
Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. 🌟pic.twitter.com/98j63xmtGu
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024
తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి మాంచి జోష్ మీదుండిన యశస్వి.. అదే ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సికందర్ రజా సంధించిన ఇన్ స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన యశస్వి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. యశస్వి ఔటైన అనంతరం అభిషేక్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (13) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టారు.
After conceding two sixes, Sikandar Raza took Yashasvi Jaiswal's wicket, and the celebration says it all.
📸: SonyLIV pic.twitter.com/XpNkG19AhM— CricTracker (@Cricketracker) July 14, 2024
వీరి తర్వాత క్రీజ్‌లో వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 38; 3 సిక్సర్లు), రియాన్ పరాగ్ (18 బంతుల్లో 20; సిక్స్) కుదురుగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/3గా ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా, నగరవ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్ స్థానాల్లో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.
తుది జట్లు..
జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ
టీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment