పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 161 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి నాలుగు సెంచరీలను 150 ప్లస్ స్కోర్లుగా మలిచిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
అలాగే 23 ఏళ్లు రాక ముందే నాలుగు 150 ప్లస్ స్కోర్లు చేసిన మూడో ఏషియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి ముందు సచిన్, జావిద్ మియాందాద్ 23 ఏళ్లు రాక ముందే నాలుగు 150 ప్లస్ స్కోర్లు చేశారు.
టెస్ట్‌ల్లో యశస్వి జైస్వాల్ 150 ప్లస్ స్కోర్లు..
ఇంగ్లండ్‌పై 214 (2024లో రాజ్‌కోట్ టెస్ట్‌లో)
ఇంగ్లండ్‌పై 209 (2024లో వైజాగ్ టెస్ట్‌లో)
వెస్టిండీస్‌పై 171 (2023లో డోమినికా టెస్ట్‌లో)
ఆస్ట్రేలియాపై 161 (2024లో పెర్త్ టెస్ట్‌లో)
మ్యాచ్ విషయానికొస్తే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 201 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం రాహుల్ (77) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ ఔటైన అనంతరం దేవ్‌దత్ పడిక్కల్ (25) కాసేపు నిలకడగా ఆడాడు. ఆతర్వాత అతను కూడా ఔటయ్యాడు.
161 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ అనవసరమైన షాట్ ఆడి డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో రిషబ్ పంత్ (1), ధృవ్ జురెల్ (1) వికెట్లు కోల్పోయింది. 100 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 326/5గా ఉంది.
విరాట్ కోహ్లి (20), వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 372 పరుగులుగా ఉంది. భారత్ మరో 100 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా (5/30), హర్షిత్ రాణా (3/48), సిరాజ్ (2/20) చెలరేగిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో నాథన్ మెక్‌స్వీని (10), ట్రవిస్ హెడ్ (11), అలెక్స్ క్యారి (21), మిచెల్ స్టార్క్ (26) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (37), ధృవ్ జురెల్ (11), నితీశ్ రెడ్డి (41) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మిచ్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment