బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాను గాయాల సమస్య వేధిస్తుంది. చేతి వేలి గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ ఇదివరకే తొలి టెస్ట్‌కు దూరంగా కాగా.. తాజాగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ గాయం బారిన పడినట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సందర్భంగా యశస్వి మెడ పట్టేసినట్లు సమాచారం.
యశస్వి నొప్పితో విలవిలలాడుతున్న దృష్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. టీమ్ ఫిజియో యశస్వి మెడకు మసాజ్ చేస్తూ కనిపించాడు. యశస్వి గాయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఈ విషయం మాత్రం టీమిండియా అభిమానులను తెగ కలవరపెడుతుంది.
ఇప్పటికే రోహిత్ దూరమయ్యాడు..!
తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలోనే ఉండిపోయాడు. తొలి టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండడం లేదు. రోహిత్‌కు ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ పేర్లను పరిశీలుస్తున్నారు. ఇప్పుడు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా గాయం బారిన పడితే తొలి టెస్ట్‌కు భారత్ రెగ్యులర్ ఓపెనర్లు లేకుండా బరిలోకి దిగినట్లవుతుంది.
2020-21లోనూ ఇదే సీన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సిరీస్‌లోనూ టీమిండియా ఇదే తరహాలో గాయల బారిన పడింది. నాటి సిరీస్‌లోనూ భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సందర్భంగా గాయాల బారిన పడ్డారు. దీంతో టీమిండియా ఆ సిరీస్‌లో ప్రత్యామ్నాయ ఆటగాళ్లతో బరిలోకి దిగింది.
అనుభవం లేని ఆటగాళ్లతో టీమిండియా..!
పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో టీమిండియా పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్‌పై ఆధారపడాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా తప్పుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు ఛాన్స్ దక్కవచ్చు.
ఈ సిరీస్‌లో భారత పేస్ అటాక్ అత్యంత బలహీనంగా కనిపిస్తుంది. బుమ్రా మినహా జట్టులో పెద్దగా అనుభవజ్ఞులు లేరు. సిరాజ్‌కు పదుల సంఖ్యలో టెస్ట్‌లు ఆడిన అనుభవమున్నా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ టెస్ట్ మ్యాచ్‌లే ఆడారు. ఈ సిరీస్‌లో టీమిండియా ప్రధాన బలం స్పిన్నర్లు. అయితే తొలి టెస్ట్‌కు వేదిక అయిన పెర్త్ స్పిన్నర్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment