వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లకు అర్హత సాధించలేకపోవడంతో పాటు స్వదేశంలో నమీబియా, ఐర్లాండ్ లాంటి చిన్న జట్ల చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న జింబాబ్వే జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నించిన ప్రధాన కోచ్ డేవ్ హటన్ తప్పనిసరి పరిస్థితుల్లో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది.
డేవ్ హటన్ కెప్టెన్‌గా, కోచ్‌గా ఉన్న కాలంలో జింబాబ్వే స్వర్ణ యుగాన్ని చవిచూసింది. ఒక సమయంలో డేవ్‌తో కూడాని జింబాబ్వే.. ఆస్ట్రేలియా, భారత్ లాంటి జట్లను సైతం గడగడలాడించింది. అలాంటి జట్టు ప్రస్తుతం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో హటన్ తన గట్టెక్కించేందుకు విఫలయత్నం చేసి చేత కాక తప్పుకున్నాడు.
జింబాబ్వే జట్టులో కొత్తగా కెప్టెన్‌గా నియమితుడైన సికందర్ రజా ఒక్కడే రాణిస్తుండగా, మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేస్తున్నారు. పరాయి దేశస్తుడిని తీసుకు వచ్చి కెప్టెన్‌గా చేయడం వల్లే, జట్టులోని మిగతా ఆటగాళ్లు అతనికి సహకరించడం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జింబాబ్వే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment