టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి చిత్ర విచిత్రమైన హావభావాలతో మెరిశాడు. క్యాచ్ పట్టినప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్.. వికెట్ పడినప్పుడు మరొక ఎక్స్‌ప్రెషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి బాగా వైరల్ అయింది మాత్రం జింబాబ్వే బ్యాటర్ వెస్లీ మాధవరే క్యాచ్ పట్టినప్పుడు కోహ్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్.
జింబాబ్వే ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన మాధవరే కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఈ సమయంలో మోకాళ్లపై కూర్చొని చిరునవ్వుతో కోహ్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ హైలైట్ అయింది. కాగా కోహ్లి ఎక్స్‌ప్రెషన్‌పై క్రికెట్ అభిమానులు స్పందించారు. ''ఇలాంటివి కోహ్లికి మాత్రమే సాధ్యం.. ఎక్కడి నుంచి తెస్తావు ఈ వింత ఎక్స్‌ప్రెషన్స్'' అంటూ కామెంట్ చేశారు.
ఇక మ్యాచ్‌లో కోహ్లి 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తరపున లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్న కోహ్లి ఐదు మ్యాచ్‌లు కలిపి 245 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 1రియాన్ బర్ల్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సికందర్ రజా 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలు రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 61 నాటౌట్, కేఎల్ రాహుల్ 51 రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment