
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 44.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఇది అతడికి తన కెరీర్‌లో తొలి సెంచరీ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో జద్రాన్ 141 బంతుల్లో 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రహమత్ షా 88 పరుగులతో రాణించాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, తిరిపానో చెరో వికెట్ సాధించారు. కాగా అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 228 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఇనోసెంట్ కియా 69 పరుగులు, రాయర్ బర్ల్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మూడు,ఫజల్హక్ ఫారూఖీ,నబీ,రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: Umran Malik Bowling Idols: 'వకార్ యూనిస్ ఎవరో తెలియదు.. ఆ ముగ్గురు పేసర్లే నా ఆదర్శం'