జింబాబ్వేపై తొలి వన్డేలో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ లిటన్ దాస్ గాయం కారణంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. హారారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా లిటన్ దాస్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్ట్ హార్ట్‌గా వెనుదిరగాడు.
అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాలు సమయం పట్టనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ క్రమంలో లిటన్ దాస్ ఆసియాకప్-2022కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్- జింబాబ్వే మధ్య రెండో వన్డే హారారే వేదికగా ఆదివారం(ఆగస్టు7)న జరగనుంది. లిటన్ దాస్ స్థానంలో నజ్ముల్ హుస్సేన్ శాంటో తుది జట్టలోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక తొలి వన్డే విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. జింబాబ్వే విజయంలో ఆల్ రౌండర్ సికందర్ రజా(135), ఇనోసెంట్ కాయ(110) అద్భుతమైన సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తమీమ్ ఇక్భాల్(62), లిటన్ దాస్(81),అనముల్ హాక్(73) పరుగులతో రాణించారు. అనంతరం 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలోనే చేధించింది.
చదవండి: ZIM vs BAN: పూర్వ వైభవం దిశగా అడుగులేస్తుందా..!
Comments
Please login to add a commentAdd a comment