మార్టిన్ గప్టిల్ సెన్సేషనల్ క్యాచ్..
ముంబై: ఐపీఎల్10లో భాగంగా వాంఖెడే మైదానంలో నిన్న (గురువారం) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ అద్బుతంగా క్యాచ్ పట్టి ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్యాచ్ పట్టినతీరు చూస్తే ఆహా అనాల్సిందే. మ్యాక్స్‌వెల్ బౌలింగ్ లో ముంబై ఓపెనర్ సిమ్మన్స్ భారీ షాట్ ఆడగా ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గప్టిల్ క్యాచ్ పట్టేందుకు అమాంతం గాల్లోకి ఎగిరాడు. తొలుత రెండు చేతులతో క్యాచ్ పట్టాలని భావించిన గప్టిల్ అది అసాధ్యమని.. ఆ తర్వాత క్షణాల్లో కేవలం ఒంటిచేత్తో అద్భుతంగా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఆపై బౌండరీ లైన్ ను తాకకుండా జాగ్రత్తగా శరీరాన్ని నియంత్రించుకోవడంపై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి.
దీంతో ముంబై స్కోరు 106 పరుగుల వద్ద సిమ్మన్స్ (32 బంతుల్లో 59: 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్ రూపంలో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. గప్టిల్ పట్టిన క్యాచ్‌కు పంజాబ్ ఆటగాళ్లతో పాటు ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ముగ్దులయ్యారు. ఈ క్యాచ్‌తో గప్టిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ లభించింది. ఈ మ్యాచ్‌లో గప్టిల్ చిరుతలా మైదానంలో వేగంగా కదిలి మరో రెండు క్యాచులు పట్టి నితీశ్ రాణా, రోహిత్ శర్మలు ఔట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. మెరుగైన ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా ఉత్కంఠపోరులో ముంబైపై 7 పరుగుల తేడాతో పంజాబ్ నెగ్గిన విషయం తెలిసిందే.
What a beautiful catch... Amazingly done by #Guptill
— Abhinav Joshi (@ABHlNAV) 11 May 2017
Woah....!
— Sourav Rawat (@SouravRawat_17) 11 May 2017
Martin Guptill superman catch✈✈ Catch of the season.😎#MIvKXIP pic.twitter.com/XQ3bByi51v