పీకే, డీకే అవుట్
రాజ్‌కోట్: ఐపీఎల్-10లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా బౌలింగ్ తీసుకున్నాడు.
తమ జట్టు కూర్పులో నాలుగు మార్పులు జరిగాయని రైనా వెల్లడించాడు. ఫాల్కనర్ స్థానంలో ఆండ్రూ టైయిని తీసుకున్నట్టు చెప్పాడు. ఇషాన్ కిషాన్ అనారోగ్యం కారణంగా ఆడడం లేదని.. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ శుభమ్ అగర్వాల్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. పీకే, డీకే (ప్రవీణ్ కుమార్, ధావల్ కులకర్ణి) ప్లేస్ లో నాథు సింగ్, అఖదీప్ నాథ్‌ల ను తీసుకున్నట్టు రైనా చెప్పాడు.
పంజాబ్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. మనన్ వోహ్రా టీమ్ లోకి వచ్చాడు. స్వప్నిల్ స్థానంలో కేసీ కరియప్పా, ఇషాంత్ శర్మ ప్లేస్ లో టి. నటరాజన్ ను తీసుకున్నట్టు కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వెల్లడించాడు. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన ఈ రెండు జట్లు రెండేసి మ్యాచుల్లో నెగ్గి నాలుగేసి పాయింట్లు సాధించాయి.