వీరేంద్ర సెహ్వాగ్‌కు కీలక బాధ్యతలు | Sehwag to head Cricket Operations & Strategy for KXIP | Sakshi
Sakshi News home page

వీరేంద్ర సెహ్వాగ్‌కు కీలక బాధ్యతలు

Published Mon, Jan 23 2017 3:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

వీరేంద్ర సెహ్వాగ్‌కు కీలక బాధ్యతలు

వీరేంద్ర సెహ్వాగ్‌కు కీలక బాధ్యతలు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు మెంటర్గా ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్‌ టీమ్‌కు సెహ్వాగ్‌ మెంటర్గా ఉంటూనే, జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్, స్ట్రాటజీ విభాగం చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడు. అలాగే జట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తాడు. పంజాబ్‌ జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. వీరూ అనుభవం, సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకముందని, కొత్త పాత్రలో అతను రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు కింగ్స్ లెవెన్ ప్రమోటర్లు చెప్పారు. జట్టుకు మెంటర్గా, ఇతర బాధ్యతలను వీరూ చేపట్టడం  గొప్ప విషయంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

తనకు అదనపు, కీలక బాధ్యతలు అప్పగించడంపై సెహ్వాగ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతిభావంతులైన యువకులకు మెంటర్గా వ్యవహరిస్తూ, జట్టును నడిపించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. పంజాబ్‌ జట్టు తన అభిప్రాయాలకు తగినట్టుగా ఉందని, ఈ సీజన్లో జట్టును విజయపథంలో నడిపించడంపై దృష్టిసారిస్తున్నానని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement