IPL franchise
-
ఐపీఎల్ వేలం కోసం వెటోరి
పెర్త్: ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడి ఐపీఎల్ మెగా వేలానికి బయలుదేరుతాడు. ఈ న్యూజిలాండ్ బౌలింగ్ దిగ్గజం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో 45 ఏళ్ల వెటోరి సౌదీ అరేబియాలోని రెండో పెద్ద నగరం జిద్దాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొంటాడు. ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో తొలి టెస్టు 22 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ అయిన వెటోరికి మద్దతిస్తాం. అతను మొదటి టెస్టు సన్నాహానికి చేయాల్సిందంతా (ట్రెయినింగ్) చేసే వేలానికి హాజరవుతాడు. ఇందులో మాకు ఏ ఇబ్బంది లేదు. మెగా వేలం ముగిసిన వెంటనే మళ్లీ మా జట్టుతో కలుస్తాడు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సీఏ నేషనల్ డెవలప్మెంట్ కోచ్ లాచ్లన్ స్టీవెన్స్... తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని సీఏ తెలిపింది. కివీస్‌కు చెందిన వెటోరి మాత్రమే కాదు... ఆ్రస్టేలియన్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లు సైతం జిద్దాకు పయనమవుతారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు, లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌లుగా ఉన్నారు. దీంతో ‘చానెల్ సెవెన్’లో వ్యాఖ్యాతలు వ్యవహరించనున్న వీళ్లిద్దరు కూడా పెర్త్ టెస్టు మధ్యలోనే మెగా వేలంలో పాల్గొననున్నారు. -
స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే!
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది. మంగళవారంతో రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించే గడువు ముగియడంతో ఆయా ప్రాంఛైజీలు తమ తుది జాబితాలను ప్రకటించాయి. ఏ ప్రాంఛైజీ ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయో, ఎవరని వేలంలో పెట్టాయో ఓ లూక్కేద్దాం. గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా ఆరుగురిని విడిచిపెట్టింది. ఇక ఓవరాల్‌గా మినీవేలంకు ముందు గుజరాత్ పర్స్‌లో 19.25 కోట్లు ఉన్నాయి. గుజరాత్ రిటైన్ లిస్ట్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్ గుజరాత్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా ఐదుగురుని విడిచిపెట్టింది. ఇక ఓవరాల్‌గా మినీ వేలంకు ముందు ఢిల్లీ పర్స్‌లో 19.45 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్ రెహ్మన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్ ఢిల్లీ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్ రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు రాజస్తాన్ రాయల్స్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 9 మంది ప్లేయర్స్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం రాజస్తాన్ పర్స్‌లో రూ. 13.2 కోట్లు ఉన్నాయి. రాజస్తాన్ రిటైన్ లిస్ట్ సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు కేకేఆర్ 11 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 16 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్‌కతా పర్స్‌లో రూ. 7.5 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ రిటైన్ లిస్ట్ శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్ కేకేఆర్ రిలీజ్ లిస్ట్ పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు పంజాబ్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 9 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం పంజాబ్ పర్స్‌లో రూ. 32.2 కోట్లు ఉన్నాయి. పంజాబ్ రిటైన్ లిస్ట్ శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బిఆర్ పంజాబ్ విడుదలచేసిన జాబితా మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు ఆర్సీబీ 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 5 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం ఆర్సీబీ పర్స్‌లో రూ. 8.75 కోట్లు ఉన్నాయి. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్ ఆర్సీబీ విడుదల చేసిన ఆటగాళ్లు: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ. సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ మిగిలిన పర్స్ బ్యాలన్స్: రూ. 20.55 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ కెఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బడోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ విడుదలైన ఆటగాళ్లు: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ విడిచిపెట్టిన ఆటగాళ్లు: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్ మిగిలిన పర్స్ బ్యాలన్స్: రూ. 20.45 కోట్లు -
అసలు ఆటగాళ్లతో పాటు...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ లేదా ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా స్థానిక యువ బౌలర్లు నెట్స్‌లో వివిధ జట్లకు సహకరించటం పరిపాటి. జట్టు ప్రధాన బౌలర్లపై భారం తగ్గించడంతో పాటు విభిన్న శైలి బౌలర్లను ఎదుర్కొంటే బ్యాట్స్‌మెన్‌కు అది మేలు చేస్తుందనే నమ్మకమే అందుకు కారణం. సాధారణంగా ఐపీఎల్ సమయంలో ఆయా వేదికల్లో పెద్ద సంఖ్యలో నెట్ బౌలర్లు స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పుడు లీగ్ స్వదేశంలో కాకుండా యూఏఈలో జరుగుతోంది. అక్కడ కూడా జట్టు కోరితే స్థానికంగా బౌలర్లు అందుబాటులో ఉండవచ్చు. అయితే తాజా కోవిడ్–19 పరిస్థితుల్లో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. అందుకే టీమ్‌తో పాటు ఇక్కడినుంచే నెట్ బౌలర్లను కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. వీరంతా ‘బయో బబుల్’లో తమతో భాగంగా ఉండాలని, బయటి వ్యక్తులు ఎవరూ రావాల్సిన అవసరం ఉండరాదని కోరుకుంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లను ఇందు కోసం తమ జట్టుతో పాటు యూఏఈకి ప్రత్యేకంగా తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. వీరంతా తమ జట్టుతో పాటే ఉంటారని చెన్నై టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. ఇదే తరహాలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా పది మందిని తీసుకెళ్లనున్నట్లు చెప్పింది. కేకేఆర్ అకాడమీ కోచ్ అభిషేక్ నాయర్ వీరిని ఎంపిక చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరుగురు బౌలర్లను తమ టీమ్‌తో పాటు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. యూఏఈకి వెళ్లే ఐపీఎల్ ఫ్రాంచైజీ బృందంలో సభ్యుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకపోవడంతో వారు ఈ తరహా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కలిగింది. సాధారణంగా రంజీ ట్రోఫీ లేదా సీనియర్ స్థాయిలో దేశవాళీ టోర్నీ ఆడిన, అండర్–23, అండర్–19 బౌలర్లు నెట్ బౌలర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. మరో వైపు యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటం, తీవ్ర వేడిమి కారణంగా పొడిబారిన పిచ్‌లపై వారు ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రతీ జట్టు నెట్ బౌలర్ల బృందంలో ఎక్కువ మంది స్పిన్నర్లు ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 20 నుంచి... ఐపీఎల్ జట్లు ప్రత్యేక విమానాల్లో యూఏఈకి వెళ్లే తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. అందరికంటే ముందుగా ఈ నెల 20న రాజస్తాన్ రాయల్స్ బయల్దేరుతుంది. ఆగస్టు 21న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వెళతాయి. తర్వాతి రోజు పంజాబ్, ఢిల్లీ జట్లు వెళ్లే అవకాశం ఉంది. ముంబై జట్టులోని కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది గత వారం రోజులుగా క్వారంటైన్ కేంద్రంలో ఉంటూ కోవిడ్ పరీక్షలకు కూడా హాజరయ్యారు. ధోనిసేన మాత్రం యూఏఈ బయల్దేరడానికి ముందు 15 మందితో చెన్నైలో స్వల్పకాలిక (ఆగస్టు 16 నుంచి 20 వరకు) శిబిరంలో పాల్గొంటుంది. కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ నెల చివరి వారంలో యూఏఈ వెళుతుంది. ఆగస్టు 23 వరకు ఈ జట్టుకు చెందిన భారత ఆటగాళ్లంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో గడుపుతారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఇంకా తమ ప్రయాణ తేదీలు, ఇతర ఏర్పాట్లను ఇంకా ఖరారు చేసుకోలేదు. -
వీరేంద్ర సెహ్వాగ్‌కు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు మెంటర్‌గా ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ టీమ్‌కు సెహ్వాగ్ మెంటర్‌గా ఉంటూనే, జట్టు క్రికెట్ ఆపరేషన్స్, స్ట్రాటజీ విభాగం చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడు. అలాగే జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తాడు. పంజాబ్ జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. వీరూ అనుభవం, సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకముందని, కొత్త పాత్రలో అతను రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు కింగ్స్ లెవెన్ ప్రమోటర్లు చెప్పారు. జట్టుకు మెంటర్‌గా, ఇతర బాధ్యతలను వీరూ చేపట్టడం గొప్ప విషయంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తనకు అదనపు, కీలక బాధ్యతలు అప్పగించడంపై సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతిభావంతులైన యువకులకు మెంటర్‌గా వ్యవహరిస్తూ, జట్టును నడిపించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. పంజాబ్ జట్టు తన అభిప్రాయాలకు తగినట్టుగా ఉందని, ఈ సీజన్లో జట్టును విజయపథంలో నడిపించడంపై దృష్టిసారిస్తున్నానని అన్నాడు. -
అండర్సన్ పై కన్నేసిన ఐపిఎల్ ఫ్రాంచైజీలు
-
రూపాయల్లోనే వేలం
న్యూఢిల్లీ: డాలర్ మారకం రేటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఊరట లభించింది. ఐపీఎల్-7 కోసం వేలాన్ని డాలర్లకు బదులు రూపాయలతో నిర్వహిస్తారు. ఒక్కో ఫ్రాంఛైజీ ప్రస్తుత జట్టులో ఉన్న క్రికెటర్లలో ఐదుగురిని కొనసాగించుకోవచ్చు. మిగిలిన వాళ్లను వేలంలో కొనుక్కోవాలి. ఒక్కో జట్టు వేలంలో గరిష్టంగా రూ.60 కోట్లు మాత్రమే ఖర్చుచేయాలి. సింగపూర్‌లో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఫ్రాంఛైజీల యజమానులకు ఐపీఎల్ కౌన్సిల్ ఈ వివరాలను తెలిపినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. అలాగే ఆటగాళ్లకు ప్రతి ఏడాది ఐదుశాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. చాంపియన్స్ లీగ్‌కు జట్టు అర్హత సాధిస్తే... ఆ లీగ్‌లో ఆడే మ్యాచ్‌లకు కూడా అదనపు మొత్తం చెల్లించాలని ఒక ప్రతిపాదన వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్-7 జరుగుతుంది. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలు జరిగినా మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే నిర్వహించాలని కౌన్సిల్ భావిస్తోంది. ఐపీఎల్‌తో యువ ఆటగాళ్లకెంతో లాభం: ద్రవిడ్ ఐపీఎల్‌తో యువ క్రికెటర్లకు చాలా లాభాలున్నాయని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. టీమిండియాకు ఆడకముందే వేలాదిమంది ప్రేక్షకుల మధ్య ఆడే అనుభవం లభిస్తుందని, దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అద్భుత అవకాశం కూడా లాభిస్తుందని అతను తెలిపాడు. ఢిల్లీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్ రాసిన ‘ద స్కై ఈజ్ ద లిమిట్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.