భారత్‌తో తొలి టెస్టు మధ్యలో ఆస్ట్రేలియా జట్టును వీడనున్న అసిస్టెంట్ కోచ్
పెర్త్: ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడి ఐపీఎల్ మెగా వేలానికి బయలుదేరుతాడు. ఈ న్యూజిలాండ్ బౌలింగ్ దిగ్గజం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో 45 ఏళ్ల వెటోరి సౌదీ అరేబియాలోని రెండో పెద్ద నగరం జిద్దాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొంటాడు.
ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో తొలి టెస్టు 22 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ అయిన వెటోరికి మద్దతిస్తాం. అతను మొదటి టెస్టు సన్నాహానికి చేయాల్సిందంతా (ట్రెయినింగ్) చేసే వేలానికి హాజరవుతాడు. ఇందులో మాకు ఏ ఇబ్బంది లేదు. మెగా వేలం ముగిసిన వెంటనే మళ్లీ మా జట్టుతో కలుస్తాడు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సీఏ నేషనల్ డెవలప్‌మెంట్ కోచ్ లాచ్లన్ స్టీవెన్స్... తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని సీఏ తెలిపింది.
కివీస్‌కు చెందిన వెటోరి మాత్రమే కాదు... ఆ్రస్టేలియన్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌లు సైతం జిద్దాకు పయనమవుతారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు, లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌లుగా ఉన్నారు. దీంతో ‘చానెల్ సెవెన్’లో వ్యాఖ్యాతలు వ్యవహరించనున్న వీళ్లిద్దరు కూడా పెర్త్ టెస్టు మధ్యలోనే మెగా వేలంలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment