న్యూఢిల్లీ: డాలర్ మారకం రేటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఊరట లభించింది. ఐపీఎల్-7 కోసం వేలాన్ని డాలర్లకు బదులు రూపాయలతో నిర్వహిస్తారు. ఒక్కో ఫ్రాంఛైజీ ప్రస్తుత జట్టులో ఉన్న క్రికెటర్లలో ఐదుగురిని కొనసాగించుకోవచ్చు. మిగిలిన వాళ్లను వేలంలో కొనుక్కోవాలి. ఒక్కో జట్టు వేలంలో గరిష్టంగా రూ.60 కోట్లు మాత్రమే ఖర్చుచేయాలి. సింగపూర్‌లో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఫ్రాంఛైజీల యజమానులకు ఐపీఎల్ కౌన్సిల్ ఈ వివరాలను తెలిపినట్లు సమాచారం.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. అలాగే ఆటగాళ్లకు ప్రతి ఏడాది ఐదుశాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. చాంపియన్స్ లీగ్‌కు జట్టు అర్హత సాధిస్తే... ఆ లీగ్‌లో ఆడే మ్యాచ్‌లకు కూడా అదనపు మొత్తం చెల్లించాలని ఒక ప్రతిపాదన వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్-7 జరుగుతుంది. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలు జరిగినా మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే నిర్వహించాలని కౌన్సిల్ భావిస్తోంది.
ఐపీఎల్‌తో యువ ఆటగాళ్లకెంతో లాభం: ద్రవిడ్
ఐపీఎల్‌తో యువ క్రికెటర్లకు చాలా లాభాలున్నాయని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. టీమిండియాకు ఆడకముందే వేలాదిమంది ప్రేక్షకుల మధ్య ఆడే అనుభవం లభిస్తుందని, దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అద్భుత అవకాశం కూడా లాభిస్తుందని అతను తెలిపాడు. ఢిల్లీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్ రాసిన ‘ద స్కై ఈజ్ ద లిమిట్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రూపాయల్లోనే వేలం
Published Sun, Dec 1 2013 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement