జాంటీ రోడ్స్‌లా.. సాహా సూపర్‌ క్యాచ్ | Wriddhiman Saha Does a Jonty Rhodes Against Royal Challengers Bangalore | Sakshi
Sakshi News home page

జాంటీ రోడ్స్‌లా.. సాహా సూపర్‌ క్యాచ్

Published Tue, Apr 11 2017 3:32 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

జాంటీ రోడ్స్‌లా.. సాహా సూపర్‌ క్యాచ్

జాంటీ రోడ్స్‌లా.. సాహా సూపర్‌ క్యాచ్

ఇండోర్: టీమిండియా కీపర్‌గా వృద్ధిమాన్ సాహా అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసి పట్టుకున్నాడు. సాహా గాల్లోకి డైవ్ చేసి అసాధారణ రీతిలో క్యాచ్‌లు పట్టుకుని తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్న సందర్భాలున్నాయి. తాజాగా ఐపీఎల్-2017 సీజన్‌లో సాహా ఇలాంటి అరుదైన ఫీట్‌ను రిపీట్ చేసి దక్షిణాఫ్రికా గ్రేట్ జాంటీ రోడ్స్‌ను తలపించాడు.

సోమవారం రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన గతి తెలిసిందే.  సాహా కింగ్స్‌ లెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బెంగళూరు బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్ వరుణ్ అరోన్ వేసిన షార్ట్ డెలివరీని బెంగళూరు ఆటగాడు మణ్‌దీప్‌ సింగ్‌ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా, బంతి వికెట్ల వెనుక గాల్లోకి లేచింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరు. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన సాహా పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి డైవ్ చేసి సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వారందరూ స్టన్ అయ్యారు. సాహా ఫీల్డింగ్‌ను ప్రశంసించారు. మణ్‌దీప్ క్యాచవుట్‌గా పెవిలియన్ చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement