IPL 2018 Winner: IPL Season 11 Winner Predicts by Scientific Astrologer Greenstone Lobo - Sakshi
Sakshi News home page

ఐపీఎల్ 11 విజేత ఎవరంటే..!

Apr 6 2018 8:51 PM | Updated on Apr 7 2018 11:07 AM

Scientific Astrologer Greenstone Lobo Predicts IPL 11 winner - Sakshi

ముంబై: ఇంకా ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం అవకముందే విజేత ఎవరో ఎలా తెలుస్తుందంటారా.. ప్రతి టోర్నీ, ఈవెంట్ల ప్రారంభంలో జట్ల బలబలాలు, విజయావకాశాలపై కొన్ని అంచనాలు ఉండటం సహజం. ఈ క్రమంలో ఈ సీజన్‌లో విజేత అయ్యేందుకు జట్లకు ఉన్న అవకాశాలపై ప్రముఖ జ్యోతిష్కుడు, విశ్లేషకుడు గ్రీన్‌స్టోన్ లోబో జోస్యం చెప్పాడు. 1981లో పుట్టిన కెప్టెన్లు గౌతం గంభీర్, ఎంఎస్ ధోనిలు మరోసారి ట్రోఫీ నెగ్గే అవకాశం లేదన్నాడు. అంటే ఢిల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నెగ్గవని చెప్పినట్లు. అనుభవం ఉన్న కెప్టెన్లను ఈ సీజన్లో దూరం చేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు ట్రోఫీ నెగ్గేలా కనిపించడం లేదు. 

గ్రీన్‌స్టోన్ లోబో లెక్క ప్రకారం ఐపీఎల్ 11 రేసులో ఇక మిగిలిన నాలుగు జట్లు.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌,  రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌. ఈ నాలుగు జట్ల పోటీ ఎక్కువగా ఉన్నా ఇందులో రెండు జట్లను మాత్రం అదృష్టం వరిస్తుందన్నాడు. రోహిత్ శర్మ నేతృత్వంలో వరుసగా రెండోసారి ముంబై ట్రోఫీ నెగ్గదని, గంభీర్ స్థానంలో కోల్‌కతా కెప్టెన్‌గా వచ్చిన దినేశ్ కార్తీక్ వీక్ కెప్టెన్‌గా కనిపించడం దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. 

ఇక రేసులో మిగిలింది పంజాబ్‌, బెంగళూరు జట్లు. జ్యోతిష్యం ప్రకారం చూసినా, అనుభవం పరంగా, ఆటపట్ల అంకిత భావం చూసినా విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌కు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వీరి ఆటకు గ్రహబలం తోడవుతుందని.. దీంతో బెంగళూరు లేక పంజాబ్ జట్లలో ఓ జట్లు ఐపీఎల్ 11వ సీజన్‌ను కైవసం చేసుకుంటుందని జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో తన అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నాడు. అయితే విజేతగా నిలిచి ఏ జట్టు ట్రోఫీ నెగ్గుతుందో తెలియాలంటే 27 మే వరకు వేచిచూడాల్సిందే.


గ్రీన్‌స్టోన్ లోబో (ఫైల్ ఫొటో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement