ఐపీఎల్-11లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓవైపు ముంబై ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు పంజాబ్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.