అక్షర్‌ అ‘ధర’హో | Axar Patel sold for Five crore To Delhi Capitals | Sakshi
Sakshi News home page

అక్షర్‌కు అక్షరాల ఐదు కోట్లు

Published Tue, Dec 18 2018 4:27 PM | Last Updated on Tue, Dec 18 2018 4:31 PM

Axar Patel sold for Five crore To Delhi Capitals - Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌ సీజన్‌ 12 కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. కోటి కనీస ధరతో ఐపీఎల్‌ వేలంలోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీలు ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసుకోవడానికి పోటీపడ్డాయి. కానీ చివరకు అక్షర్‌ను ఢి​ల్లీ సొంత చేసుకుంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో హనుమ విహారి జాక్‌పాట్‌ కొట్టాడు. అతని కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్‌ తీసుకోగా,  హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement