అభిమానికి సెహ్వాగ్‌ పాదాభివందనం | Sehwag Met His Senior Fan Om Prakash | Sakshi
Sakshi News home page

అభిమానికి సెహ్వాగ్‌ పాదాభివందనం

Published Wed, Apr 18 2018 11:29 AM | Last Updated on Wed, Apr 18 2018 12:17 PM

Sehwag Met His Senior Fan Om Prakash - Sakshi

చండీఘడ్‌ : ఇంత వరకు అభిమానులు వారి అభిమాన తారల, క్రీడాకారుల కాళ్లకు దండం పెట్టడం చూశాం. కానీ మన వీర బాదుడు వీరేంద్రుడు మాత్రం అందుకు భిన్నంగా తన అభిమాని పాదాలకు వందనం చేశాడు. 93 ఏళ్ల ఓం ప్రకాశ్‌ అనే తాత సెహ్వాగ్‌కు వీరాభిమాని. పటియాలకు చెందిన ఆయన మంగళవారం చండీఘడ్‌లో తన అభిమాన క్రికెటర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఓం ప్రకాశ్‌ కాళ్లు మొక్కి ఆయన దీవెనలు పొందారు సెహ్వాగ్‌. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో ఫోస్ట్‌ చేసింది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌. సెహ్వాగ్‌ కూడా తన 93 ఏళ్ల సీనియర్‌ అభిమానితో దిగిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘దాదా కో ప్రణామ్‌’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement