కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింతా
న్యూఢిల్లీ : ‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్’ ఫ్రాంచైజీ పేరు మారబోతుందా?. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 10 సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడానికి జట్టు పేరే కారణమని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సహ యజమాని ప్రీతి జింతా ఫ్రాంచైజీ పేరు మార్పుకు బీసీసీఐను అభ్యర్థించినట్లు తెలిసింది.
అమెరికాలో ఏటా జరిగే ఎన్‌బీఏ, బేస్‌బాల్ లీగ్‌లను ఇందుకు ఆమె ఉదాహరణగా పేర్కొన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌బీఏ, బేస్‌బాల్ లీగ్‌లలో సీజన్ సీజన్‌కు పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరును మార్చేందుకు అవకాశం ఇవ్వాలని ప్రీతీ కోరినట్లు వెల్లడించారు. అయితే, ఫ్రాంచైజీ పేరు మార్పుపై బీసీసీఐ ఇంకా ఎలాంటి హామీ ఇవ్వనట్లు సమాచారం.
కాగా, ఈ సీజన్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లను పంజాబ్ జట్టు వేలంలో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వేలంలో కేఎల్ రాహుల్(రూ.11 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్ (రూ.7.6 కోట్లు), ఆండ్రూ టై (రూ.7.2 కోట్లు), అరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు), స్టాయినిస్ (రూ.6.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు), క్రిస్‌గేల్ (రూ.2 కోట్లు) పంజాబ్ కొనుగోలు చేసింది. మరి స్టార్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీ పేరు మార్పు పంజాబ్ దశను తిప్పుతాయేమో వేచి చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment