డ్యాన్సింగ్‌ అంకుల్‌ను మించిపోయాడుగా! | Preity Zinta Shares a Funny Video | Sakshi
Sakshi News home page

డ్యాన్సింగ్‌ అంకుల్‌ను మించిపోయాడుగా!

Published Fri, Apr 12 2019 4:34 PM | Last Updated on Fri, Apr 12 2019 4:41 PM

Preity Zinta Shares a Funny Video - Sakshi

ముంబై : ఉత్కంఠకర సమయంలో మమ్మల్ని ఉల్లాసరపరిచాడంటూ కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహయజమాని ప్రీతీ జింటా చేసిన ఓ ట్విట్‌ తెగహల్‌చల్‌ చేస్తోంది. ‘ ముంబైతో మ్యాచ్‌ ఉత్కంఠకరంగా సాగుతున్నసమయంలో ఓ అభిమాని వన్‌మ్యాన్‌ ఆర్మీలా మా అందరిని ఎంటర్‌టైన్‌ చేశాడు’ అని క్యాఫ్షన్‌గా ఓ వీడియోను ట్వీట్‌ చేసింది. ఈ వీడియోలో ఓ మధ్యవయసు గల వ్యక్తి చిందేస్తూ మ్యాచ్‌ను అస్వాదించాడు. అయితే ఆ వ్యక్తి డ్యాన్స్‌ చూస్తే మాత్రం ఎవ్వరికి నవ్వాగదు. అంతలా అదరగొట్టాడు. అయితే ఆ అంకుల్‌ డ్యాన్స్‌కు ముగ్ధులైన నెటిజన్లు ఫన్నీ క్యాప్షన్‌తో కామెంట్‌ చేస్తున్నారు.  డ్యాన్సింగ్‌ అంకుల్‌ మించిపోయాడుగా! అని ఒకరంటే..  అంకుల్‌ సూపర్‌ అంటూ మరొకరు కితాబిచ్చారు. బుధవారం ముంబై-కింగ్స్‌పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఓ పంజాబ్‌ అభిమాని చిందేస్తూ ఇలా మ్యాచ్‌ను అస్వాదించాడు. కానీ పోలార్డ్‌ దెబ్బకు చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ ముంబై వశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement