
మయాంక్ అగర్వాల్ డకౌట్
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఆదిలోనే వికెట్ ను కోల్పోయింది. పుణె ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ లో నాలుగు బంతుల్ని ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్ పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు.
కింగ్స్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దాంతో పరుగుకే పుణె వికెట్ ను నష్టపోయింది. ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇది పంజాబ్ కు తొలి మ్యాచ్ కాగా, పుణెకు రెండో మ్యాచ్. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పుణె ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.