Rising Pune Supergiant
-
ముంబై ఇండియన్స్ సరిగ్గా ఇదే రోజు
హైదరాబాద్ : ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ఉత్కంఠ పోరులో అనూహ్య విజయన్నందుకొని టైటిల్‌ను సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. స్టీవ్ స్మిత్ సారథ్యంలోని అప్పటి జట్టు రైజింగ్ పుణె ఆఖరి వరకు పోరాడి చేతులెత్తేసింది. చివరి బంతి వరకు ఈ మ్యాచ్ డ్రామాను తలిపించింది. తక్కువ స్కోర్ల మ్యాచే అయినా ఐపీఎల్ ఫైనల్ అంటే ఎంత ఉత్కంఠగా సాగాలో అలాగే సాగింది. అనూహ్య రీతిలో మలుపులు తిరిగి ఆటను చివరి క్షణం వరకు రక్తి కట్టించింది. ఈ అద్భుత పోరులో చివరకు ముంబై అనుభవం గెలిచింది. ఒకే ఒక్క పరుగుతో ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. పుణె విజయాన్ని లాగేసిన జాన్సన్.. ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరం. తొలి బంతిని మనోజ్ తివారీ చక్కటి ఫోర్‌గా మలిచాడు. అయితే తర్వాతి రెండు బంతుల్లో తివారీ, స్మిత్‌లను అవుట్ చేసిన జాన్సన్ మ్యాచ్‌ను ముంబై చేతుల్లోకి తెచ్చాడు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేసినా పుణేకు ఓటమి తప్పలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, మూడో పరుగు తీసే ప్రయత్నంలో సుచిత్ త్రోకు క్రిస్టియాన్ అవుటయ్యాడు. దీంతో ముంబై విజయం సాధించింది. కొంప ముంచిన అతి జాగ్రత్త.. రైజింగ్ పుణే సూపర్ జెయింట్... అతి జాగ్రత్త జట్టు కొంప ముంచింది. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే పరిమితం చేయగలిగినా... టీ20 తరహా దూకుడు ఎక్కడా చూపించకుండా ఒత్తిడి పెంచుకుంది. 20 ఓవర్లలో ఏ దశలోనూ జట్టు రన్‌రేట్ కనీసం 7 పరుగులు దాటలేదు. చివరి వరకు నిలిచి విజయం వైపు నడిపించగలడని నమ్మిన స్టీవ్ స్మిత్ చేతులెత్తేశాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ రోహిత్ శర్మ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పుణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్ స్మిత్ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. అద్భుత ప్రదర్శన కనబర్చిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు లభించింది. ఈ సీజన్లో నిరాశపరిచిన రోహిత్ సేన మేటి ఆటగాళ్లతో.. ఢిఫెండింగ్ చాంపియన్‌గా ఎన్నో అంచనాల మధ్య ఈ సీజన్లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కూడా కనబర్చలేకపోయింది. టోర్నీ ఆరంభంలోనే వరుస ఓటములను మూటగట్టుకున్న ముంబై అనూహ్యంగా విజృంభించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ముంబై నెలకు కొట్టిన బంతిలా పుంజుకుంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
'ఆ లోటు పుణె జట్టులో కనబడింది'
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ పోరులో గెలుపు అంచుల వరకూ వచ్చి చతికిలబడటం పట్ల రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకపోవడమే తుది పోరులో ఓటమి చెందడానికి ప్రధాన కారణంగా విశ్లేషించాడు. 'బెన్ స్టోక్స్ లేని లోటు కనబడింది. ఫైనల్ పోరుకు స్టోక్స్ ఉండి ఉంటే ఫలితం మరొరకంగా ఉండేది. స్టోక్స్ లేకపోవడం వల్ల మేము ఎక్సట్రా బౌలర్ తో బరిలోకి దిగాల్సి వచ్చింది. దాంతో బ్యాటింగ్ విభాగం బలహీనపడింది. ఆ క్రమంలోనే 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యాం. ఇక్కడ స్టీవ్ స్మిత్-రహానేల భాగస్వామ్యం తప్పితే, వేరే మంచి భాగస్వామ్యాలు రాలేదు. కీలక సమయాల్లో వరుసగా వికెట్లను కోల్పోతూ ఒత్తిడిలో పడ్డాం. దాంతో ముంబై ఇండియన్స్ కు దాసోహమయ్యాం' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఆఖరి పోరులో పుణె పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. కేవలం స్మిత్, రహానేలు తప్పితే మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో టైటిల్ ను అందుకోవాలనుకున్న పుణె ఆశలు తీరలేదు. -
ఆ క్యాచే కొంపముంచిందా?
-
ఆ క్యాచే కొంపముంచిందా?
హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప లక్ష్యాన్ని సునాయంగా ఛేదిస్తుందని భావించిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు చివరికి ఓటమి పాలైంది. చేతుల్లోకి ఇచ్చిన మ్యాచ్‌ను చేజార్చుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తన టీమ్ పరాజయంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా అయింది. అర్ధసెంచరీతో చివరి ఓవర్ వరకు పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కీలక సమయంలో అవుటవడంతో పుణే మూల్యం చెల్లించుకుంది. ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతిని మనోజ్ తివారి చక్కటి ఫోర్‌గా మలిచాడు. తర్వాతి బంతికి అతడు అవుటయ్యాడు. అయితే స్మిత్ క్రీజ్‌లో ఉండడంతో పుణే విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. అప్పటికే అతడు ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ పుణేకు మిచెల్ జాన్సన్ షాక్ ఇచ్చాడు. తివారి అవుట్ చేసిన తర్వాతి బంతికే స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను అంబటి రాయుడు పట్టడంతో అతడు నిరాశగా మైదానాన్ని వీడాడు. ఈ క్యాచ్‌ను రాయుడు వదిలేసివుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ క్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని అందరూ అభిప్రాయపడ్డారు. స్మిత్ అవుటైన తర్వాత పుణేపై ఒత్తిడి మరింత పెరిగింది. చివరి బంతికి 4 పరుగులు చేయాల్సిన పుణే రెండు పరుగులు మాత్రమే సాధించి ఓటమి పాలయింది. స్మిత్ ఉన్నంతసేపు పుణేవైపు ఉన్న మ్యాచ్ అతడు అవుటైన తర్వాత ముంబై చేతుల్లోకి వచ్చింది. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి రోహిత్ సేన మూడోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. -
వారి కారణంగానే ఓడిపోయాం: కెప్టెన్ స్మిత్
ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టును చివరివరకు విజయం ఊరించింది. చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులు చేస్తే ఆ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ వరించేది. చేతిలో ఎనిమిది వికెట్లు సైతం ఉన్నాయి. ఈ దశలో పుణె విజయం ఖాయమని అంతా భావించారు. కానీ, చివరివరకు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణె జట్టు ఆశలు అడియాసలయ్యాయి. చివరివరకు క్రీజ్‌లో ఉండి 51 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్నిందించలేకపోయిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ మ్యాచ్ అనంతరం ఒకింత నిర్వేదంగా మాట్లాడాడు. ఈ పరాజయాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమని చెప్పాడు. అయితే, టోర్నమెంటు మొత్తం తమ ఆటగాళ్లు చక్కని ఆటతీరు ప్రదర్శించడం గర్వంగా ఉందని చెప్పాడు. 129 పరుగులు భారీ లక్ష్యమేమీ కాదని, కానీ ఈ వికెట్ మీద పరుగులు రాబట్టడం కష్టంగా మారిందని, అందువల్లే గెలుపునకు దూరమయ్యామని చెప్పాడు. తమ ఓటమికి ముంబై బౌలర్లే ప్రధాన కారణమని స్మిత్ అంగీకరించాడు. పరుగులు చేయకుండా తమ బ్యాట్స్‌మెన్‌ను ముంబై బౌలర్లు నిలువరించారని, అదే మ్యాచ్ గతిని మార్చేసిందని చెప్పాడు. ‘మా చేతిలో వికెట్లు ఉన్నాయి. ఒకటి, రెండు మంచి ఓవర్లు పడితే చాలు మ్యాచ్ మా చేతిలోకి వచ్చేది. కానీ, వాళ్లు (బౌలర్లు) అద్భుతంగా ఆడి.. మమ్మల్ని నిలువరించారు’ అని అన్నాడు. ఐపీఎల్లో ఆడటం చాలా అద్భుతంగా ఉందని, గత రెండేళ్ల కాలంలో ఐపీఎల్లో ఆడటం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని స్మిత్ చెప్పాడు. -
ధోనీకి మరో చేదు అనుభవం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మహేంద్రసింగ్ ధోనీకి మరోసారి ముంబై చేతిలో చేదు అనుభవమే ఎదురైంది. ఐపీఎల్ ఫైనల్లో మొత్తం నాలుగుసార్లు ముంబై ఇండియన్స్‌ను ధోనీ ఎదుర్కోగా.. వరుసగా మూడుసార్లు ముంబైదే పైచేయి అయింది. 2010, 2013, 2015లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ ఫైనల్లో ధోనీ ముంబై జట్టును ఎదుర్కొన్నాడు. 2010లో ముంబైపై విజయం సాధించినప్పటికీ.. 2013, 2015లలో పరాభవాలే ఎదురయ్యాయి. తాజాగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు ఆటగాడిగా ధోనీ మరోసారి ఐపీఎల్ ఫైనల్లో ముంబైతో తలపడ్డాడు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణె ఓడించిన ముంబై మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ధోనీ రికార్డు.. అత్యధిక ఐపీఎల్ ఫైనల్ మ్యాచులు ఆడిన తొలి ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. మొత్తం ఏడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లో (ఆరుసార్లు చెన్నై తరఫున, ఒకసారి పుణె తరఫున) ధోనీ ఆడాడు. అంతేకాకుండా అత్యధిక ఐపీఎల్ ఫైనల్ మ్యాచులను కోల్పోయిన ప్లేయర్‌గా కూడా అతనే నిలిచాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రమేయముండటంతో చెన్నై, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్లను సుప్రీంకోర్టు సస్పెండ్ చేయడంతో ధోనీ పుణె జట్టుకు మారాడు. ఈ సీజన్లో ధోనీ బ్యాటుతో అంత గొప్పగా రాణించలేకపోయాడు. కానీ వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అదరగొట్టాడు. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబైపై 26 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు ధోనీ మధురమైన విజయాన్ని అందించాడు. అలాగే, హైదరాబాద్ జట్టు 34 బంతుల్లో 61 పరుగులు చేసి లీగ్ దశలో జట్టును గెలిపించాడు. మొత్తానికి ఈ సిరీస్‌లో పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ధోనీ అడపాదడపా తనదైన సత్తాను చాటాడు. -
పూణేకు స్వల్ప లక్ష్యం
-
'ఐపీఎల్ ఫైనల్ నీకో ఛాన్స్'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10లో ఫైనల్ కు చేరి అందరి అంచనాల్ని తలక్రిందులు చేసింది రైజింగ్ పుణె సూపర్ జెయింట్. ఇప్పటికే రెండు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ను తుది సమరంలో ఢీకొట్టడానికి సిద్దమైంది. తమ జట్టు ఫైనల్ వరకూ చేరడానికి కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఎంఎస్ ధోనిల మధ్య సఖ్యత బాగుండటమేనని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. ధోని, స్మిత్ లు మంచి సారథులుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. జట్టులో వారి మధ్య సమన్వయం చాలా బాగుంది. ఇదే మా జట్టు ఫైనల్ కు చేరడానికి దోహదం చేసింది. వీరిద్దరూ సీనియర్లు కావడంతో కోచ్ గా నాకు కాస్త భారం తగ్గింది. యువ క్రికెటర్లు వీరి నుంచి ఎక్కువ నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పదేళ్ల ఐపీఎల్ ను చూస్తే అత్యంత విజయవంతమైన క్రికెటర్ ధోని. ప్రస్తుతం ధోని కోసం మరో ఐపీఎల్ ఫైనల్ ఎదురుచూస్తోంది' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో టీమిండియా క్రికెటర్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ -10లో ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే జట్టు ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో పుణే ఆటగాడు ధోనీ రికార్డు స్థాయిలో ఏడోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత వహించిన ఏకైక క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ఆ జట్టు తరఫున ఏకంగా ఆరుసార్లు ఫైనల్ మ్యాచ్ లో భాగస్వామి అయ్యాడు. కెప్టెన్‌గా రెండుసార్లు చెన్నైకి ఐపీఎల్ కప్ అందించాడు. గత రెండు సీజన్ల నుంచి పుణే జట్టకు ఆడుతున్న ధోనీ ఐపీఎల్-10లో ఫైనల్ ఆడబోతున్న ఆ జట్టులో కీలక ఆటగాడు. నిన్న (మంగళవారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో ధోనీ వీర విహారం చేయడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. ప్రతి మ్యాచ్‌లోనూ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విలువైన సలహాలిస్తూ, అవసరమైనప్పుడు ఫీల్డింగ్ సెట్ చేస్తూ జట్టు విజయంలో ధోనీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎంఎస్ ధోనీ (26 బంతుల్లో 40 నాటౌట్; 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓటమిపాలైంది. మూడు వికెట్లు తీసి పుణే విజయంలో కీలకపాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్ (3/16)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. -
ఏడు పరుగులతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం
-
రైజింగ్ పుణేకు షాక్
-
రైజింగ్ పుణేకు షాక్
⇒ ఏడు పరుగులతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం ⇒ మనోజ్ తివారి పోరాటం వృథా లక్ష్యం 169 పరుగులు.. వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌కు ఇది ఏమంత కష్టసాధ్యమైనదేమీ కాదనే అంతా భావించారు. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు మాత్రం చివరి బంతి వరకు పోరాడి ప్రత్యర్థిని కంగుతినిపించారు. ఈ మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్‌లో దర్జాగా చోటు దక్కించుకుందామనుకున్న స్మిత్ బృందం ఇక తమ చివరి మ్యాచ్ వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. న్యూఢిల్లీ: సూపర్ ఫామ్‌లో ఉన్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ జోరును ఢిల్లీ డేర్‌డెవిల్స్ అడ్డుకుంది. లక్ష్యం భారీగా లేకపోయినా పేసర్లు జహీర్ ఖాన్ (2/25), మొహమ్మద్ షమీ (2/37) అద్భుత బౌలింగ్ కారణంగా పుణే వణికింది. అంతకుముందు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్ (45 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్లన్ శామ్యూల్స్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. ఉనాద్కట్, స్టోక్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసి ఓడింది. మనోజ్ తివారి (45 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతి వరకు పోరాడాడు. స్మిత్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. కరుణ్ ఒక్కడే... టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆద్యంతం ఓపెనర్ కరుణ్ నాయర్ నడిపించాడు. తొలి మూడు ఓవర్లలోనే సంజూ సామ్సన్ (2), ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (3) అవుట్ కావడంతో 9 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కరుణ్, రిషబ్ పంత్ జోరుతో పరుగుల వేగం పెరిగింది. నాలుగో ఓవర్లో కరుణ్ రెండు ఫోర్లు, రిషబ్ ఓ సిక్స్ బాదగా.. ఐదో ఓవర్లో కరుణ్, ఆరో ఓవర్లో పంత్ మూడేసి ఫోర్లతో రెచ్చిపోవడంతో ఈ రెండు ఓవర్లలోనే 28 పరుగులు వచ్చాయి. అయితే తొమ్మిదో ఓవర్లో జంపా ఈ జోడిని విడదీశాడు. అప్పటికే ఆ ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ కొట్టిన పంత్‌ను తను అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మార్లన్ శామ్యూల్స్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 37 బంతుల్లో కరుణ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా అటు వరుస ఓవర్లలో అండర్సన్ (3), కమిన్స్ (11) పెవిలియన్‌కు చేరడంతో జట్టు స్కోరు నెమ్మదించింది. అయితే 18వ ఓవర్లో నాయర్ రెండు ఫోర్లు, మిశ్రా ఓ సిక్స్ బాదడంతో 19 పరుగులు రాగా పుంజుకుంది. ఆ తర్వాత ఓవర్లో నాయర్‌ను స్టోక్స్ అవుట్ చేశాడు. ఇక చివరి ఓవర్లో షమీ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర స్టోక్స్ అద్భుత రీతిలో అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. డీప్ మిడ్వికెట్లో తను బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో బౌండరీ లైన్ దాటేస్తానని భావించి మెరుపువేగంతో బంతిని తిరిగి మైదానంలోకి విసిరాడు. అయితే అది కిందపడేలోపే తను మరోసారి లోనికి వచ్చి అందుకున్నాడు. తివారి ఒంటరి పోరు లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణేకు ప్రారంభంలోనే జహీర్ ఖాన్ షాక్ ఇచ్చాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయని తను ఈసారి తొలి బంతికే రహానేను డకౌట్ చేశాడు. అలాగే దీంతో ఐపీఎల్లో వంద వికెట్లను పూర్తిచేసుకున్నాడు. అయితే నాలుగో ఓవర్లో కెప్టెన్ స్మిత్ 4,6,4తో చెలరేగి 14 పరుగులు రాబట్టాడు. ఐదో ఓవర్లో జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జహీర్ తన మూడో ఓవర్లో రాహుల్ త్రిపాఠి (7)ని అవుట్ చేశాడు. ఈ సమయంలో స్మిత్‌కు జతగా మనోజ్ తివారి నిలిచాడు. తివారి వరుసగా రెండు ఫోర్లతో పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ జోరు మీదున్న స్మిత్‌ను తొమ్మిదో ఓవర్లో చక్కని లైన్ అండ్ లెంగ్త్ బంతితో ఎల్బీగా అవుట్ చేశాడు. మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు పరుగులకు కట్టడి చేయగలిగారు. అయితే ఫీల్డర్ల వైఫల్యంతో తివారి వరుసగా రెండు ఓవర్లలో ఇచ్చిన క్యాచ్‌లు మిస్ అయ్యాయి. 16వ ఓవర్లో స్టోక్స్‌ను షమీ అవుట్ చేయగా నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో ధోని (5) షమీ సూపర్ త్రోకు రనౌట్ కాగా క్రిస్టియాన్ (3) ఎల్బీగా అవుట్ అయి ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఓవర్లో 25 పరుగులు రావాల్సి ఉండగా తివారి వరుసగా రెండు సిక్సర్లు, ఆ తర్వాత ఓ ఫోర్ బాదినా ఫలితం లేకపోయింది. -
పుణే దూకుడు కొనసాగేనా?
⇒ నేడు ఢిల్లీతో తలపడనున్న సూపర్‌జెయింట్ ⇒ పటిష్టంగా పుణే ⇒ డేర్‌డెవిల్స్ అస్థిర ప్రదర్శన న్యూఢిల్లీ :వరుస విజయాలతో జోరుమీదున్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపుమీదున్న పుణే.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు చివరిమ్యాచ్‌లో కోల్‌కతాపై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ తన విజయమంత్రాన్ని కొనసాగించాలని భావిస్తోంది. జోరుమీదున్న పుణే.. గతేడాది ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ చెత్త ఆటతీరుతో ఆ సీజన్లో అట్టడుగున ఏడోస్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్లో పుణే దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా చివరగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు నమోదు చేయడం విశేషం. ఓవరాల్‌గా 16 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో 148 పరుగుల ఓ మాదిరి స్కోరునే చేసినా.. బౌలర్లు ఆకట్టుకోవడంతో అద్భుతవిజయం సాధించింది. ముఖ్యంగా జయదేవ్ ఉనాద్కట్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. హ్యాట్రిక్‌తో సన్‌రైజర్స్‌ను కకావికలం చేశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లోనూ తను ఇదే విధంగా రాణించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 367 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు నమోదు చేశాడు. మరోవైపు ఈ సీజన్లో అరంగేట్రం చేసిన కుర్ర సంచలనం రాహుల్ త్రిపాఠి ఆకట్టుకుంటున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 353 పరగులు చేశాడు. బెన్ స్టోక్స్ (283 పరుగులు), అజింక్య రహానే (248), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (235 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. మనోజ్ తివారీ, డాన్ క్రిస్టియన్ తమ బ్యాట్లకు పదును పెట్టాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అంచనాలకు మించి రాణించాడు. మొత్తం 12 మ్యాచ్‌లాడిన తాహిర్ 18 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఉనాద్కట్ (17 వికెట్లు), బెన్ స్టోక్స్ (10) ఆకట్టుకుంటున్నారు. డాన్ క్రిస్టియాన్, శార్ధుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ సత్తాచాటాల్సి ఉంది. మరోవైపు గత సీజన్లో ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగగా అందులో పుణేనే విజయం సాధించింది. అయితే ఈ సీజన్లో ఇరుజట్లు పరస్పరం తలపడగా.. 97 పరుగులతో పుణే ఘనవిజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పుణే భావిస్తోంది. జట్టు ఆటతీరు చూస్తే ఈ మ్యాచ్‌లో పుణేనే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఢిల్లీ పడుతూ లేస్తూ..: ఈ సీజన్లో అత్యంత అస్థిరప్రదర్శన కనబర్చే జట్టు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ డేర్‌డెవిల్స్ అనడంలో సందేహం లేదు. ఒక మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ మరోమ్యాచ్‌లో 66 పరుగులకే కుప్పకూలడం ఢిల్లీ విషయంలో మాత్రమే సాధ్యమవుతోంది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 5 విజయాలు, 7 పరాజయాలు నమోదు చేసింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ లయన్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని అద్భుత రీతిలో ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే సంజూ శామ్సన్, కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, కోరీ అండర్సన్, కార్లోస్ బ్రాత్వైట్లాంటి ఆటగాళ్లున్నా.. సమష్టిగా రాణించడం లేదు. ఒక మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్ విజయవంతమైతే మరో మ్యాచ్‌లో ఇంకో బ్యాట్స్‌మెన్ సత్తాచాటుతున్నాడు. జట్టుగా మాత్రం రాణించలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే సంజూ సామ్సన్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా 12 మ్యాచ్‌ల్లో 384 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తను ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ.. ఫామ్‌లోకొస్తే విధ్వంసక ఇన్నింగ్స్ ఆటగలడు. ఈ సీజన్లో ఓ సెంచరీ కూడా నమోదు చేశాడు. అది పుణేపైనే కావడం విశేషం. శుక్రవారం మ్యాచ్‌లో తను మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి ఇది తోడ్పడుతుంది. శ్రేయస్ అయ్యర్ (303 పరుగులు), రిషభ్ పంత్ (285), కరుణ్ నాయర్ (191) ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ కారణంగా క్రిస్ మోరిస్, కగిసో రబడ జట్టు నుంచి దూరమవడం ఢిల్లీకి ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ప్యాట్ కమిన్స్ ఆకట్టుకుంఉటున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ మోరిస్ కూడా 12 వికెట్లు తీయడం విశేషం. అమిత్ మిశ్రా (10 వికెట్లు), జహీర్ ఖాన్ (7) ఫర్వాలేదనిపిస్తున్నారు. లీగ్ తొలిదశలో పుణేపై భారీ విజయం సాధించిన ఢిల్లీ మరోసారి అదే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు గుజరాత్తోమ్యాచ్లో గాడిన పడిన ఢిల్లీ ఆ మ్యాచ్‌లోలాగే మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. -
సన్‌రైజర్స్ పుంజుకుంటుందా..?
►నేడు పుణేతో తలపడనున్న హైదరాబాద్ ► సొంతగడ్డపై బలంగా వార్నర్‌సేన ►వరుస విజయాల జోరులో సూపర్‌జెయింట్ హైదరాబాద్: ప్లే ఆఫ్‌లో చోటే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. ఈ సీజన్లో సొంతగడ్డపై ఓటమన్నదే లేకుండా సాగుతున్న హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న పుణే ఇదే జోరును కొనసాగించాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గిన పట్టికలో రెండోస్థానానికి ఎగబాకుతారు. అజేయంగా వార్నర్‌సేన.. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ సీజన్లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై అదేస్థాయి ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఆయా మ్యాచ్‌ల్లో విజయాన్ని నమోదు చేసింది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన వార్నర్‌సేన ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు మూటగట్టుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఓవారల్‌గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడిన చివరిమ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వార్నర్‌సేన 185 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ సమష్టిగా రాణించారు. ముఖ్యంగా డాషింగ్ ఆల్‌రౌండర్ మెరుపు ఇన్నింగ్స్‌తో గాడిలో పడ్డాడు. అతని ధాటికి సన్‌రైజర్స్ భారీస్కోరును నమోదు చేసింది. అయితే టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ ఆ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. దీంతో ఆరు వికెట్లతో ఓటమిపాలైంది. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరుగకుండా చూడాలని జట్టు యాజమాన్యం కృతనిశ్చయంతో ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు మూలస్తంభంలా నిలిచాడు. ఇప్పటివరకు పది మ్యాచ్‌లాడిన వార్నర్ 489 పరుగులతో టోర్నీలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో ‘ఆరెంజ్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. శిఖర్ ధావన్ (369 పరుగులు), కేన్ విలియమ్సన్ (228 పరుగులు), మోజెస్ హెన్రిక్స్ (225 పరుగులు), యువరాజ్ సింగ్ (187 పరుగులు)లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. దీపక్ హుడా, నమన్ ఓజాలకు బ్యాటింగ్‌లో అంతగా అవకాశాలు రాలేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ముందే చెప్పినట్లుగా టోర్నీలోనే పటిష్టమైన బౌలింగ్ లైనప్ సన్‌రైజర్స్ సొంతమనడంలో సందేహం లేదు. పేసర్ భువనేశ్వర్ కుమార్ పది మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో టోర్నలో అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ‘పర్పుల్ క్యాప్’ను తన సొంత చేసుకున్నాడు. అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ 12 వికెట్లతో సత్తాచాటాడు. ఆశిష్ నెహ్రా, సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, హెన్రిక్స్ ఆకట్టుకుంటున్నారు. గత సీజన్లో హైదరాబాద్, పుణే జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగగా.. ఇరుజట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. మరోవైపు ఈ సీజన్లో పుణేలో జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు పరస్పరం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెలరేగడంతో పుణే విజయం సాధించింది. దీంతో శనివారం మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. అలాగే తనకెంతో అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో పుణేను కంగుతినిపించాలని కృతనిశ్చయంతో ఉంది. పుణే జోరు.. మరోవైపు ఈ సీజన్లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ జోరుమీదుంది. ముఖ్యంగా పుణే ఆడిన చివరి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలో పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లపై గెలుపొందింది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన పుణే ఏడు విజయాలు, నాలుగు పరజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చివరిమ్యాచ్ కోల్‌కతాపై రాహుల్ త్రిపాఠీ వన్‌మ్యాన్ షోతో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. సహచరులంతా విఫలమైనా వేళ.. ఈ సీజన్లో అరంగేట్రం చేసిన త్రిపాఠి సమయోచిత బ్యాటింత్తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టోర్నీలో ఖరీదైన ఆటగాడు బెన్‌స్టోక్స్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో పుణే జట్టు ఫుల్‌జోష్‌లో ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్ (333 పరుగులు) జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా త్వరలో తను గాడిలో పడతాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక రాహుల్ త్రిపాఠి 9 మ్యాచ్‌ల్లో 352 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బెన్ స్టోక్స్ (244 పరుగులు), ఎంఎస్ ధోని (204 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. అజింక్య రహానే (226 పరుగులు), మనోజ్ తివారీ (190 పరుగులు) గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఇమ్రాన్ తాహిర్ అంచానలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన తాహిర్ 17 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. జయదేవ్ ఉనాద్కట్ (12 వికెట్లు), బెన్ స్టోక్స్, డాన్ క్రిస్టియన్, శార్దుల్ ఠాకూర్ రాణిస్తున్నారు. మరోవైపు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మధ్య ఓవర్లలో పరుగులు నియంత్రిస్తున్నాడు. ఈ సీజన్లో హైదరాబాద్‌తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో పుణే అద్భుత విజ యం సాధించింది. శనివారం మ్యాచ్‌లో అదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఆశిస్తోంది. అయితే సొంతగడ్డపై సత్తా చాటే హైదరాబాద్‌ను పుణేను ఎంతవరకు నిలువరిస్తుందో చూడాలి. -
ధోనీ సింప్లిసిటీ చూసి అవాక్కయ్యారు.
-
ధోనీ సింప్లిసిటీ చూసి అవాక్కయ్యారు
ఐపీఎల్-2017 సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం లేకుండానే అతన్ని వివాదాలు చుట్టుముట్టాయి. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ కెప్టెన్సీ నుంచి ధోనీని జట్టు యాజమాన్యం తొలగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ధోనీని కించపరిచేలా పుణె టీమ్ యజమాని సోదరుడు ట్వీట్ చేయడం మరింత వివాదం రాజేసింది. ఈ సీజన్లో బ్యాట్స్‌మన్‌గా ధోనీ ఆటతీరుపైనా విమర్శలు వచ్చాయి. అయితే ధోనీ ఎక్కడా వీటిపై పెదవి విప్పలేదు. అభిమానులు, మాజీలు అతనికి అండగా నిలిచారు. ఈ వివాదాలను పక్కనబెడితే మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మిస్టర్ కూల్‌గా ఉండే ధోనీ.. నిజజీవితంలోనూ సింపుల్‌గా ఉంటాడు. తాజాగా సోషల్ మీడియాలో్ వైరల్ అవుతున్న ఓ వీడియోను ఇందుకు నిదర్శనం. ధోనీ ఎయిర్‌పోర్ట్‌లో పుణె టీమ్మేట్ ఇమ్రాన్ తాహిర్ కొడుకు గిబ్రాన్‌తో కలసి ఫ్లోర్‌పై కూర్చున్నాడు. ఓ బొమ్మ కారుతో చిన్నారి గిబ్రాన్‌తో ఆడుకుంటూ ఈ వీడియోలో మహీ కనిపిస్తాడు. కాగా ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు. ఐపీఎల్లో పుణె తర్వాతి మ్యాచ్ హైదరాబాద్‌తో ఆడాల్సివుంది. పుణె జట్టు హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ధోనీ సింప్లిసిటీని చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు. ధోనీ గతంలో కూడా పలుమార్లు ఓ సామాన్యుడిలా ప్రవర్తించిన సంఘటనలున్నాయి. -
‘సెంచరీ చేయనందుకు బాధ లేదు’
కోల్‌కతా: సెంచరీ చేయడం కంటే జట్టును గెలిపించడమే ముఖ్యమని రైజింగ్ పుణే సూపర్ జెయింట్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి అన్నాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడం తనకు ఇష్టమని తెలిపాడు. ఏడు పరుగుల తేడాతో ఐపీఎల్లో తొలి సెంచరీ చేజారడం పట్ల తనకు ఎటువంటి విచారం లేదన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో త్రిపాఠి 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. ‘ఈ రోజు బాగా ఆడాను. చివరి వరకు క్రీజ్‌లో ఉండాలనుకున్నాడు. సెంచరీ కోల్పోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. మ్యాచ్ గెలవడం అన్నిటికంటే ముఖ్యం. ఎటువంటి ప్రణాళికలు వేసుకోకుండానే బ్యాటింగ్‌కు దిగాను. ఎంఎస్ ధోని, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ఆటగాళ్లతో ఆడడం నాకెంతో ఉపకరించింది. రహానేతో ఓపెనింగ్‌కు రావడం అద్బుతమైన అనుభవం. రహానే నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. మైదానం వెలుపల కూడా సహచర ఆటగాళ్లు ఎంకరేజ్ చేశార’ని త్రిపాఠి వెల్లడించాడు. -
ఐపీఎల్: కొత్త స్టార్ వెలుగులోకొచ్చాడు!
కోల్ కతా: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మరో యువకెరటం వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పోరాటపటిమతో రూర్కీ కుర్రాడు రాహుల్ త్రిపాఠి పుణెను విజయతీరాలకు చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసి.. తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్నందించాడు. బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్ లో రాహుల్ సూపర్ షోతో కోల్ కతా నైట్ రైడర్స్ పై రైజింగ్ పుణె జెయింట్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రాహుల్ త్రిపాఠి సత్తాతో ఉబ్బితబ్బిబైన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. 'రాహుల్ త్రిపాఠి అంటే ఏమిటో మాకు ఈ మ్యాచ్ తెలిసేలా చేసింది. మ్యాచ్ లో రానురాను వికెట్ స్లోడౌన్ అవుతుందని మేం భావించాం. అందుకే ఆరంభ పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నించాం. త్రిపాఠి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. దురదృష్టవశాత్తు అతను సెంచరీ చేయలేదు. సెంచరీకి అతను ఎంతో అర్హుడు' అని స్మిత్ అన్నాడు. పుణె విజయపరంపర కొనసాగుతుండటంపై స్మిత్ హర్షం వ్యక్తం చేశాడు. గడిచిన ఏడు మ్యాచులలో ఆరింటిలో గెలుపొందడం ఆనందంగా ఉందని చెప్పాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతాను 155/8 పరుగులకు పరిమితం చేసిన పుణె బౌలర్లను కూడా ఆయన కొనియాడాడు. -
అగ్రస్థానమే లక్ష్యంగా..
►నేడు పుణేతో తలపడనున్న కోల్‌కతా ∙ ►సొంతగడ్డపై బలంగా నైట్‌రైడర్స్ ∙ ►వరుస విజయాలతో సూపర్‌జెయింట్ జోరు కోల్‌కతా: సొంతగడ్డపై చెలరేగే కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. ఇప్పటివరకు వరుస విజయాలతో దూకుడు కనబర్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చివరిమ్యాచ్‌లో అడ్డుకట్ట పడింది. దీంతో పుణేతో మ్యాచ్‌లో నెగ్గి టాప్‌ప్లేస్‌ను కైవసం చేసుకోవాలని గంభీర్‌సేన భావిస్తోంది. మరోవైపు రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న పుణే అదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. టాప్ ఆర్డరే బలం.. రెండుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్లో మంచి జోరుమీదుంది. ఓవరాల్‌గా పది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడింటిలో ఓడిపోయింది. దీంతో 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ తర్వాత పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఈక్రమంలో పుణేతో మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతోపాటు ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కోల్‌కతా బలం అంతా టాప్ ఆర్డర్‌లోనే ఉంది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో పది మ్యాచ్‌లాడిన గంభీర్ 55 సగటుతో 387 పరుగులు చేశాడు. దీంతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు రాబిన్ ఉతప్ప (384 పరుగులు), మనీశ్ పాండే (304 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. సునీల్ నరైన్ ఓపెనర్ అవతారంలో ఓ మోస్తరుగా రాణించాడు. కోల్‌కతా విజయం సాధించిన మ్యాచ్‌ల్లో ఎక్కువగా గంభీర్, నరైన్, ఉతప్ప, మనీశ్ పాండే రాణించారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో కోల్‌కతా టాప్ఆర్డర్ విఫలమైంది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు టాప్ ఆర్డర్ నుంచి సరైన భాగస్వామ్యం రాలేదు. గంభీర్, నరైన్ విఫలమైనా ఉతప్ప, మనీశ్ పాండే పోరాడారు. అయితే వారికి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందలేదు. ముఖ్యంగా జట్టు ఆశలు పెట్టుకున్న యూసుఫ్ పఠాన్ చేతులెత్తేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ నిరాశపర్చాడు. దీంతో భారీ తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతాకు ఇది ఒక కుదుపులాగా పరిణమించింది. దీంతో తమ జట్టు కూర్పుపై మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఆరోస్థానంలో సూర్యకుమార్, జాక్సన్ స్థానంలో ఇషాంక్ జగ్గీని బరిలోకి దింపితే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వరుసగా విఫలమవుతోన్న కొలిన్ గ్రాండ్‌హోమ్ స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే నాథన్ కూల్టర్‌నీల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లతో సత్తాచాటాడు. మరోవైపు క్రిస్ వోక్స్ కూడా 11 వికెట్ల (10 మ్యాచ్‌లు) ఆకట్టుకుంటున్నాడు. ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. యూసుఫ్ పఠాన్ మాత్రమే బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. ఈక్రమంలో సాధ్యమైనంత త్వరగా తను గాడిలో పడాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓవరాల్‌గా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా బౌలింగ్ విఫలమైంది. దీంతో ఈ సీజన్లో తొలిసారి కోల్‌కతాపై ఓ జట్టు 200 పరుగుల మార్కును సాధించింది. దీంతో ఈ విభాగంపై జట్టు మరింత దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు కోల్‌కతా మరో విజయం సాధిస్తే ఎనిమిది విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు కైవసం చేసుకోవడంతోపాటు తిరిగి అగ్రస్థానాన్ని అలంకరిస్తుంది. దీంతో పుణేతో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలని కృత నిశ్చయంతో ఉంది. అలాగే ఈ సీజన్లో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా అద్భుత విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దీంతో బుధవారం మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. పుణే దూకుడు.. ఈ సీజన్ ప్రథమార్థంలో నిరాశజనక ప్రదర్శన కనబర్చిన పుణే.. అనంతరం గాడిన పడింది. చివరగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించింది. ఓడిన ఈ ఒక్కమ్యాచ్ కోల్‌కతా చేతిలోనే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సీజన్లో పది మ్యాచ్‌లాడిన పుణే.. ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా 12 పాయింట్లతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంటుంది. ఈక్రమంలో కోల్‌కతాతో బుధవారం మ్యాచ్ ఆడనుంది. జట్టు విషయానికొస్తేసారథి స్టీవ్ స్మిత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ లయన్స్‌తో చివరిమ్యాచ్‌లో విఫలమైనా.. ఇప్పటికీ జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లాడిన స్మిత్ 324 పరుగులు సాధించి జట్టు తరఫున టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. రాహుల్ త్రిపాఠి (259 పరుగులు), అజింక్య రహానే (215 పరుగులు), ఎంఎస్ ధోని (199 పరుగులు), మనోజ్ తివారీ (182 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. గత మ్యాచ్‌లో ఈ సీజన్లోనే ఖరీదైన ఆటగాడు బెన్‌స్టోక్స్ సత్తాచాటాడు. లయన్స్‌పై విధ్వంసక సెంచరీతో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన దశలో ధోనితో కలిసి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్రమైన ఒత్తిడిలో సైతం జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఇమ్రాన్ తాహిర్ అదరగొడుతున్నాడు. పది మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో సత్తా చాటాడు. జయదేవ్ ఉనాద్కట్ పది వికెట్లతో ఆకట్టుకుంటున్నాడు. శార్దుల్ ఠాకూర్, డాన్ క్రిస్టియాన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాపై పుణే ఇప్పటివరకు విజయం సాధించలేదు. గతేడాది రెండు మ్యాచ్‌ల్లోనూ, ఈ సీజన్లో జరిగిన మ్యాచ్ కలిపి మొత్తం మూడుసార్లు పుణే పరాజయం పాలైంది. ఈ క్రమంలో సొంతగడ్డపై చెలరేగే కోల్‌కతాను పుణే ఎంతవరకు నిలువరిస్తుందో చూడాలి. మరోవైపు కోల్‌కతాపై విజయం సాధిస్తే పుణే ప్లే ఆఫ్‌కు మరింత చేరువవతుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం కోసం స్మిత్‌సేన సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు. -
స్టోక్స్ తొలి సెంచరీకి స్టార్ క్రికెటర్లు ఫిదా
పుణే: గుజరాత్ లయన్స్ విజయం ఖాయమనుకున్న దశలో విజృంభించి అజేయ శతకంతో చెలరేగిన పుణే ఆటగాడు బెన్ స్టోక్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ క్రికెటర్లు అతడి ఆటను కొనియాడుతున్నారు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ వన్ మ్యాన్ షోతో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన పుణే ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపరుచుకుంది. ఐపీఎల్లో రికార్డుస్థాయిలో రూ. 14.5 కోట్ల మొత్తాన్ని దక్కించుకున్న స్టోక్స్ తానెంత విలువైన ఆటగాడో నిరూపించాడు. అతడి ఆటకు పుణేతో పాటు ఐపీఎల్‌లోని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు దాసోహం అయ్యారు. 'జట్టుకు గొప్ప విజయం. స్టోక్స్ బ్యాటింగ్ అద్భుతం. గ్రేట్ సెంచరీ' అని పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ ట్వీట్ చేశాడు. రెండో ఓవర్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎంతో ఒత్తిడిలోనూ స్టోక్స్ ట్వంటీ20 సెంచరీ చేశాడని గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొనియాడాడు. 'ఓ లెఫ్ట్ హ్యాండర్‌గా స్టోక్స్ ఆటను చూడటం గొప్పగా ఉంది. ప్రతిభ ఉన్న క్రికెటర్ అని సీరియస్ ఇన్నింగ్స్ తో ప్రూవ్ చేసుకున్నాడు' అని యువరాజ్ ట్వీట్ చేశాడు. కెవిన్ పీటర్సన్, డుప్లెసిస్ కూడా స్టోక్స్ సెంచరీ చేసిన తీరును ప్రశంసించారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. 10 పరుగులకే మూడో వికెట్ కోల్పోవడంతో రెండో ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు స్టోక్స్. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన స్టోక్స్ చివర్లో కండరాలు పట్టేసినా పట్టుదలతో ఆడి 61 బంతుల్లో తొలి ఐపీఎల్ సెంచరీని నమోదుచేసి జట్టుకు విజయాన్ని చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. Great win for the Supergiant tonight @benstokes38 was absolutely magnificent, great 💯 👌🏽👍🏼 @ MCA… https://t.co/WD43Hzhr6T — Steve Smith (@stevesmith49) 1 May 2017 That's as good as a t20 hundred can get! Coming in at 5 in the 2nd over under pressure. Incredible @benstokes38! #wortheverycent💰 #freak — Glenn Maxwell (@Gmaxi_32) 1 May 2017 Ben strokes ! A serious knock @benstokes38 too much talent this guy possesses! Beautiful to watch as a left hander 👌🏼 — yuvraj singh (@YUVSTRONG12) 1 May 2017 -
ధోనీపై వేటు వేయడం ఆశ్చర్యకరం
మెల్బోర్న్: ఐపీఎల్ ఫ్రాంచైజీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కెప్టెన్ పదవి నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తొలగించినపుడు తనకు ఆశ్చర్యం కలిగిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ధోనీ సమర్థవంతమైన కెప్టెన్ అని పాంటింగ్ ప్రశంసించాడు. ఐపీఎల్-2017 సీజన్ ఆరంభంలో పుణె యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ ధోనీని తొలగించి అతని స్థానంలో స్టీవెన్ స్మిత్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. పుణె జట్టులో ధోనీ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ధోనీలో ఇంకా సామర్థ్యముందని, అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆశ్చర్యకరమని రికీ అన్నాడు. ఆటగాడిగా ధోనీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారిని విమర్శిస్తూ, చాంపియన్ ఆటగాడి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. కాగా ధోనీ వయసు రీత్యా ఐపీఎల్-2017 అతనికి ఆఖరి సీజన్ కావచ్చని, వచ్చే ఏడాది ఈ టోర్నీలో ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. -
ధోనీకిదే ఆఖరి సీజన్ కావచ్చు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాడిగా ధోనీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారిని విమర్శిస్తూ, చాంపియన్ ఆటగాడి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. కాగా ధోనీ వయసు రీత్యా ఐపీఎల్-2017 అతనికి ఆఖరి సీజన్ కావచ్చని, వచ్చే ఏడాది ఈ టోర్నీలో ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. తాజా ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ కెప్టెన్‌గా ధోనీని తప్పించారు. ఇక బ్యాట్స్‌మన్‌గా ధోనీ నిలకడగా రాణించలేకపోతున్నాడు. దీంతో ధోనీ బ్యాటింగ్ సామర్థ్యంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తూ విమర్శించారు. ఈ నేపథ్యంలో పాంటింగ్ స్పందిస్తూ.. 'ధోనీ సుదీర్ఘకాలం గొప్ప విజయాలు అందించాడు. ఎన్ని విజయాలు సాధించినా కెరీర్లో క్షీణదశ ఉంటుంది. నా కెరీర్లోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. నాపైనా విమర్శలు వచ్చాయి. అయితే చాంపియన్ ఆటగాళ్లను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడవద్దు' అని అన్నాడు. -
ఐపీఎల్ చరిత్రలో కేవలం రెండోసారి..
పుణే: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 10 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ పై 7 వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కేకేఆర్ ప్లేయర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒకే ఓవర్లో స్టంప్ ఔట్ ద్వారా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు కుల్దీప్. తద్వారా ఐపీఎల్ లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ గా నిలిచాడు. 2009లో జరిగిన ఐపీఎల్ రెండో సీజన్లో అమిత్ మిశ్రా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై తొలిసారి ఈ ఫీట్ నెలకొల్పాడు. ఎనిమిదేళ్ల తర్వాత కుల్దీప్ ఆ ఘనతను సాధించాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో 15వ ఓవర్లో వరుసగా 4,6 బాదిన ఎంఎస్ ధోనీ మరుసటి ఓవర్లో మరో భారీ సిక్స్‌తో చెలరేగాడు. 18వ ఓవర్ కుల్దీప్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని షాట్ ఆడేందుకు ధోనీ ముందుకు రాగా కీపర్ రాబిన్ ఉతప్ప స్టంప్స్ పడగొట్టాడు. దీంతో 148 పరుగుల వద్ద ధోనీ(16 బంతుల్లో 23) మూడో వికెట్ రూపంలో నిరాశగా వెనుదిరిగాడు. అదే ఓవర్లో ఐదో బంతికి అంచనా వేయని పుణే ప్లేయర్ మనోజ్ తివారీ(1) ముందుకొచ్చి ఆడాలని చూడగా బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే ఉతప్ప వికెట్లను గిరాటేయడం తివారీ పెవలియన్ బాట పట్టడం జరిగిపోయాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో స్టంప్ ఔట్ ద్వారా రెండు వికెట్లు తీసిన బౌలర్ గా కుల్దీప్ రికార్డు సృష్టించాడు. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి ఈ ఫీట్ నమోదుకావడంపై యంగ్ బౌలర్ కుల్దీప్ హర్షం వ్యక్తంచేశాడు. -
పుణేపై కోల్‌కతా ఘనవిజయం
-
ఉతప్ప ఉతికేశాడు
-
ఉతప్ప ఉతికేశాడు
⇒47 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతో 87 ⇒పుణేపై కోల్‌కతా ఘనవిజయం ⇒గంభీర్ అర్ధసెంచరీ పుణే: రాబిన్ ఉతప్ప (47 బంతుల్లో 87; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరబాదుడుకు కెప్టెన్ గౌతమ్ గంభీర్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) సొగసైన ఇన్నింగ్స్ తోడవడంతో... బుధవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో కోల్‌కతా 12 పాయింట్లతో అగ్ర స్థానానికి చేరుకుంది. గౌతీ, ఉతప్పల జోరుకు రెండో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యం సమకూరింది. మరోవైపు ఇక్కడ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా నెగ్గడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ స్మిత్ (37 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రహానే (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 38; 7 ఫోర్లు) రాణించారు. కుల్దీప్యాదవ్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 184 పరుగులు చేసి నెగ్గింది. ఉతప్పకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవానులకు సంతాప సూచకంగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు భుజాలకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ లయన్స్ తలపడుతుంది. స్మిత్ జోరు... మొదట బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్లు రహానే, త్రిపాఠి మరోసారి శుభారంభాన్ని అందించారు. మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన త్రిపాఠి.. ఆరో ఓవర్లో మూడు ఫోర్లతో జోరును కనబరిచాడు. దీంతో జట్టు పవర్ ప్లేలో 57 పరుగులు సాధించింది. అంతకుముందు ఓవర్లో రహానే భారీ సిక్సర్ బాదాడు. ఏడో ఓవర్లో త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను యూసుఫ్ వదిలేసినా మరుసటి ఓవర్లోనే తనను పీయూశ్ చావ్లా బౌల్డ్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రహానేతో కలిసి కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే అర్ధ సెంచరీ వైపు సాగుతున్న రహానే... నరైన్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో ఉన్నంతసేపు ధోని (11 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్‌ను ఝుళిపించాడు. 15వ ఓవర్లో వరుసగా 4,6 బాదిన తను మరుసటి ఓవర్లో మరో భారీ సిక్స్‌తో చెలరేగాడు. అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో మనోజ్ తివారి (1) కూడా అదే రీతిన అవుట్ అయినా... క్రిస్టియాన్ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), స్మిత్ చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు రాబట్టారు. ఉతప్ప, గంభీర్ నిలకడ... లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో దాదాపు మ్యాచ్ అంతా ఉతప్ప, గంభీర్ జోరే కనిపించింది. నరైన్ (11 బంతుల్లో 16; 3 ఫోర్లు) మూడో ఓవర్లోనే రనౌట్ అయినా ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. ఆ తర్వాత గంభీర్, ఉతప్ప కలిసి పుణే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. వీరి జోరుకు పుణే ఫీల్డింగ్లోపం కూడా జత కలిసింది. ఏడో ఓవర్లో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను ఉనాద్కట్ వదిలేయడంతో జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాతి ఓవర్లో తను 4,6,6తో చెలరేగాడు. ఇదే జోరుతో 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్లో గంభీర్ క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేయగా 35 బంతుల్లో తను కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 16వ ఓవర్లో ఉతప్ప రెండు భారీ సిక్సర్లు సంధించడంతో లక్ష్యం మరింత తగ్గింది. అయితే వరుస ఓవర్లలో గంభీర్, ఉతప్ప అవుటైనా అప్పటికే కోల్‌కతా విజయం ఖాయమైంది. ఐపీఎల్లో గంభీర్‌కు కెప్టెన్‌గా ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. -
ఓడినా.. వరల్డ్ రికార్డు సాధించారు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ ముంబైకు 170వ మ్యాచ్. తద్వారా ప్రపంచంలోని పొట్టి క్రికెట్ లీగ్‌ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ముంబై గుర్తింపు సాధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లిష్ జట్టు సోమర్సెట్ను వెనక్కు నెట్టింది. సోమర్ సెట్ 169 మ్యాచ్ లు ఆడగా, దాన్ని ముంబై సవరించింది. నిన్నటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడినప్పటికీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకోవడం జట్టులోని సభ్యులకు ఊరటనిచ్చే అంశం. ఇక మూడో స్థానంలో మరో ఇంగ్లిష్ జట్టు హాంప్ షైర్(166) ఉండగా, నాల్గో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(162) నిలిచింది. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్ ఆడిన 170 మ్యాచ్ ల్లో 97 విజయాల్ని ఆ జట్టు సాధించగా, 71 పరాజయాల్ని మూటగట్టుకుంది. మరో రెండింటిలో ఫలితం తేలలేదు. -
మరో విజయం కోసం
►నేడు పుణేతో తలపడనున్నసన్రైజర్స్ ►ఉత్సాహంలో హైదరాబాద్ ►ఒత్తిడిలో సూపర్‌జెయింట్ పుణే : రెండు వరుస విజయాలతో గెలుపు బాట పట్టిన డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. రెండు ఓట ముల తర్వాత గాడిన పడిన సన్‌రైజర్స్.. ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు పరాజయాల హ్యాట్రిక్ తర్వాత ఎట్టకేలకు విజయం సాధించిన పుణే తన విజయమంత్రాన్ని కొనసాగించాలని కృత నిశ్చయంతో ఉంది. సన్‌రైజర్స్ దూకుడు.. డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఆకట్టుకుంటోంది. తొలుత బెంగళూరు, గుజరాత్‌లపై విజయాలను నమోదు చేసిన హైదరాబాద్ అనంతరం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది. అయితే తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకున్న సన్‌రైజర్స్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయాలు సాధించి జోరు కనబరుస్తోంది. అయితే హైదరాబాద్ సాధించిన విజయాలన్నీ సొంతగడ్డపైనే సాధించడం విశేషం. మరోవైపు పరాయి గడ్డపై ఆడిన రెండుమ్యాచ్ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో పుణేలో జరిగే ఈ మ్యాచ్‌పై జట్టు కొంచెం ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. అయితే ప్రస్తుత సన్‌రైజర్స్ ఫామ్‌ను చూసినా.. పుణే ఆటతీరు పరిశీలించినా ఈ మ్యాచ్‌లో వార్నర్‌సేన ఫేవరేట్ అని చెప్పడంలో సందేహంలేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌సేన ఎనిమిది పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. అయితే హైదరాబాద్‌పై పుణేకు మంచి రికార్డు ఉంది. గతేడాది పుణే సాధించిన నాలుగు విజయాల్లో రెండు సన్‌రైజర్స్‌పై వచ్చినవి కావడం విశేషం. ఈక్రమంలో గతేడాది ఎదురైన రెండు పరాజయాలకు వార్నర్‌సేన బదులు తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆట గాళ్లలో 239 పరుగులతో వార్నర్ రెండోస్థానంలో ఉన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో తను విఫలమైనా జట్టు ఆందోళన పడడం లేదు. శిఖర్ శిఖర్ ధావన్, మోజెస్ హెన్రిక్స్ సత్తాచాటుతున్నారు. అయితే డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ విఫలమవడం జట్టును కలవరపరుస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌లతో ఆడిన చివరిమ్యాచ్ల్లో యువీ విఫలమయ్యాడు. అయితే బంతితో ఫర్వాలేదనిపంచడం కొంచెం ఊరటనిచ్చే అంశం. సాధ్యమైనంత త్వరగా యువీ ఫామ్‌లోకి రావాలని జట్టు ఆశిస్తోంది. మరోవైపు ఢిల్లీతో మ్యాచ్‌లో మెరుపువేగంతో బ్యాటింగ్ చేసిన కేన్ విలియమ్సన్ తుది జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. అతణ్నుంచి మరిన్ని మెరుపు ఇన్నింగ్స్‌లను జట్టు ఆశిస్తోంది. దీపక్ హూడా, నమన్ ఓజా రాణించాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సన్‌రైజర్స్‌కు టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్ విభాగం ఉంది. జట్టు పేసర్ భువనేశ్వర్ కుమార్ 15 వికెట్లతో టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. దీంతో పర్పుల్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు అఫ్గాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటుతున్నాడు. సిద్దార్థ్ కౌల్, దీపక్ హూడా రాణించాల్సిన అవసరముంది. మరోవైపు డిల్లీతో సీజన్లో తొలిమ్యాచ్ ఆడిన మహ్మద్ సిరాజ్ ఆకట్టుకున్నాడు. అతనికి మరిన్ని అవకాశాలు రావచ్చు. ఏదేమైనా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సన్‌రైజర్స్ రానున్న మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ధోని ఫామే కీలకం.. మరోవైపు గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ వరుస ఓటములతో డీలా పడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరిమ్యాచ్‌లో నెగ్గడం ద్వారా వరుసగా ఎదురైన మూడు పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. అయితే జట్టులో చాలా సమస్యలు ఉన్నాయి. కష్టకాలంలో ఉన్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ సీజన్లో వరుసగా విఫలమవుతున్నాడు. బెంగళూరుతో గత మ్యాచ్‌లో 28 పరుగులు చేసి ఫర్వాలేదపించాడు. అయితే అందులో మునుపటి మెరుపులు లేవు. ఐదు మ్యాచ్‌లాడిన ధోని 15 సగటుతో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు స్ట్రయిక్ రేట్ కూడా అంతంతమాత్రంగా (87 శాతం) ఉంది. మరోవైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ విశ్రాంతి కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో పుణే బ్యాటింగ్ మరింత బలహీన పడింది. ఈ సీజన్లో 180 పరుగులు చేసిన స్మిత్ జట్టు తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఈస్థితిలో స్మిత్ జట్టుకు దూరం కావడం పెద్ద దెబ్బే. జట్టు సారథ్య బాధ్యతలు అజింక్య రహానే చేపట్టే అవకాశముంది. టోర్నీలో అతను ఓ మాదిరిగా రాణించాడు. మనోజ్ తివారీ, రాహుల్ త్రిపాఠీ గాడిలో పడాల్సిన అవసరముంది. ఇక ఈ ఐపీఎల్‌లోనే ఖరీదైన ప్లేయర్‌గా నిలిచిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎనిమిది వికెట్లతో జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. శార్దుల్ ఠాకూర్ ఆకట్టుకుంటున్నాడు. జైదేవ్ ఉనాద్కట్, డాన్ క్రిస్టియన్ సత్తాచాటాల్సిన అవసరముంది. ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లాడిన పుణే రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి.. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో సాధ్యమైనంత త్వరగా జట్టు గాడిలోపడి వరుస విజయాలు సాధించాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌పై మెరుగైన రికార్డున్న పుణే ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. -
పుణే బౌలర్లు గెలి(పిం)చారు
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా సొంత మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తడ'బ్యాటు'తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఆర్సీబీపై 27 పరుగుల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ విజయం సాధించింది. పుణే బౌలర్లు రాణించడంతో 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పుణే నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణెకు ఓపెనర్లు శుభారంభం అందించారు. అజింక్యా రహానే(30; 25 బంతుల్లో 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి(31; 23 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్), కెప్టెన్ స్టీవ్ స్మిత్(27; 24 బంతుల్లో3 ఫోర్లు), ఎంఎస్ ధోని(28; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు ఓ మోస్తరుగా రాణించారు. మనోజ్ తివారీ 11 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లతో 27 పరుగులు సాధించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో 161 పరుగులు చేసింది 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఓపెనర్ మన్దీప్ సింగ్ రెండో ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(28; 19 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్(29; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. స్టోక్స్ బౌలింగ్ లో రహానే క్యాచ్ పట్టడంతో రెండో వికెట్ గా కోహ్లీ ఔటయ్యాడు. తాహిర్ బౌలింగ్ లో క్రీజు వదిలి ముందుకు వచ్చిన డివిలియర్స్.. ధోనీ అద్బుత స్టంప్తో నిరాశగా వెనుదిరిగాడు. ఆ పై వరుస విరామాల్లో ఆర్సీబీ వికెట్లు కోల్పోయింది. వాట్సన్(14), జాదవ్(18), స్టూవర్ట్ బిన్నీ(18; 8 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స్) షాట్లు ఆడే క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యారు. పుణే బౌలర్లు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులకు పరిమితమైంది. దీంతో 27 పరుగులతో పుణే మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పుణే బౌలర్లలో స్టోక్స్, ఠాకూర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా, తాహిర్ కు ఒక వికెట్ దక్కింది. -
ధోనీకి అండగా నిలిచిన పుణె కెప్టెన్
రాజ్‌కోట్: ఐపీఎల్-2017 సీజన్లో బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోతున్న మహేంద్ర సింగ్ ధోనీకి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అండగా నిలిచాడు. ధోనీ ఫామ్‌పై తనకు ఆందోళన లేదని, అతను క్లాస్ ఆటగాడని అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్లో తమ జట్టు కేవలం మూడే మ్యాచ్‌లు ఆడిందని, ఈ టోర్నీమిగతా మ్యాచ్ ల్లో ధోనీ రాణిస్తాడని స్మిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తమకు ధోని బ్యాటింగ్ తో ఎటువంటి ఇబ్బంది లేదని స్మిత్ పేర్కొన్నాడు. తాజా సీజన్లో పుణె కెప్టెన్‌గా ధోనీని తొలగించి, అతని స్థానంలో స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. శుక్రవారం గుజరాత్ లయన్స్‌తో పుణె తలపడనుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన గత మ్యాచ్ తనకు, తమ జట్టుకు నిరాశ కలిగించిందని స్మిత్ అన్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా తాను కడుపు నొప్పితో బాధపడ్డానని, ఇప్పుడు కోలుకున్నానని చెప్పాడు. గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కు పూర్తి ఫిట్నెస్తో ఉంటానని స్మిత్ అన్నాడు. -
గర్జించిన ఢిల్లీ.. పుణెపై ఘనవిజయం
పుణె: రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌పై ఢిల్లీ డేర్ డెవిల్స్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్ (63 బంతుల్లో 102 పరుగులు: 8 ఫోర్లు, 5 సిక్సర్లు) తొలి సెంచరీ నమోదు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణె జట్టు ఏ దశలోనూ ఢిల్లీకి పోటీ ఇవ్వలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో 16.1 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. అజింక్యా రహానె (10), మయాంక్ అగర్వాల్ (20), డుప్లెసిస్ (8), బెన్ స్టోక్స్ (2), ధోనీ (11) అందరూ విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టగా, కమిన్స్ కు రెండు వికెట్లు దక్కాయి. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ ఆదిత్యా తారే(0) వికెట్ కోల్పోయింది. బిల్లింగ్స్ (24) తో కలిసి సంజూ శాంసన్ రెండో వికెట్ కు 69 పరుగులు భాగస్వామ్యాన్ని, రిషబ్ పంత్ (31;22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి మూడో వికెట్ కు 53 పరుగులను జత చేశాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. అయితే సిక్సర్ తో సెంచరీ సాధించిన శాంసన్.. మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. పుణె స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన బంతిని భారీ షాట్ గా ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. క్రిస్ మోరిస్(38 నాటౌట్;4 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. -
ప్రతీకారంతోనే ధోనీ భార్య ఇలా చేసిందా?
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి రావత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సస్పెండైన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ లోగో ఉన్న హెల్మెట్ పెట్టుకుని దిగిన సెల్ఫీని సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. ఈ ఫొటో కింద ఆమె ఘాటైన వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. 'పక్షులు బతికున్నప్పుడు చీమలను తింటాయి. పక్షి చనిపోయిన తర్వాతే చీమలు దాన్ని తింటాయి. సమయం, పరిస్థితులు ఎప్పుడైనా మారిపోతాయి. జీవితంలో ఎవరినీ తక్కువ చేసేలా లేదా అవమానించేలా ప్రవర్తించవద్దు. ఈ రోజు నీవు బలవంతుడు కావచ్చు. అయితే నీ కంటే టైమ్ చాలా బలమైనదని గుర్తు పెట్టుకో. ఓ చెట్టు పదిలక్షల అగ్గిపుల్లలను అందిస్తుంది. అయితే పది లక్షల చెట్లను కాల్చడానికి ఓ అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచిగా ఉండు. మంచి చేయి' అని సాక్షి కామెంట్ రాసింది. తన భర్త ధోనీని అవమానించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్ యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు సాక్షి ఈ వ్యాఖ్యలు చేసిందా అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. కాగా ఈ జట్టు అధికారులపై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఐపీఎల్ నుంచి ఈ జట్టును రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ధోనీ ప్రస్తుతం పుణెకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఈ సీజన్లో పుణె యాజమాన్యం ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించింది. పుణె యాజమాన్యానికి, అతనికి పడటం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా మహీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పరుష వ్యాఖ్యలు చేశారు. దీనిపై ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధోనీ భార్య సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టింగ్ కలకలం రేపుతోంది. -
మయాంక్ అగర్వాల్ డకౌట్
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఆదిలోనే వికెట్ ను కోల్పోయింది. పుణె ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ లో నాలుగు బంతుల్ని ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్ పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు. కింగ్స్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దాంతో పరుగుకే పుణె వికెట్ ను నష్టపోయింది. ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇది పంజాబ్ కు తొలి మ్యాచ్ కాగా, పుణెకు రెండో మ్యాచ్. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పుణె ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సీఈవోగా ధోనీ సడన్ సర్ ప్రైజ్
⇒ సరికొత్త అవతారంలో ధోనీ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ కంపెనీకి సీఈవో అయ్యాడు. అదేంటీ.. క్రికెటర్ గా కొనసాగుతున్న మహీ కంపెనీ సీఈవోగా చేయడమేంటని ఆలోచిస్తున్నారా.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ 10 కోసం సన్నధ్దమైన పుణే సూపర్ జెయింట్స్ ఆటగాడు ఎంఎస్ ధోనీ సోమవారం ఓ కంపెనీకి ఒకరోజు సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఒకేఒక్కడు మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరోజు సీఎంగా వ్యవహరించినట్లే.. ధోనీకి ఒకరోజు సీఈవోగా చాన్స్ వచ్చింది. బ్యాటింగ్ సమయంలో మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బంతులను స్టాండ్స్ లోకి పంపిస్తూ, ఫీల్డిండ్ సమయంలో కెప్టెన్ కూల్ గా ఇన్నిరోజులు వ్యవహరిస్తూ కనిపించిన ధోనీ.. సూట్ లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. సీఈవోగా కొత్త అవతారం ఎత్తాడు. సీఈవో కుర్చీలో ధోనీని చూసిన కంపెనీ ఉద్యోగులు షాక్ తిన్నారు. . ధోనీ స్నేహితుడు ఆ కంపెనీ కమర్షియల్ ఇంటరెస్ట్స్ మేనేజర్ అరుణ్ పాండే ఈ విషయాలను చెప్పారు. గతంలో ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించాడు. సీఈవోగా చేసిన ధోనీ.. కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని.. అయితే ఇప్పుడు సాధ్యమైందని పాండే వివరించారు.