స్టోక్స్ తొలి సెంచరీకి స్టార్ క్రికెటర్లు ఫిదా | star cricketers reaction on Ben stokes incredible century | Sakshi
Sakshi News home page

స్టోక్స్ తొలి సెంచరీకి స్టార్ క్రికెటర్లు ఫిదా

Published Tue, May 2 2017 9:37 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

స్టోక్స్ తొలి సెంచరీకి స్టార్ క్రికెటర్లు ఫిదా

స్టోక్స్ తొలి సెంచరీకి స్టార్ క్రికెటర్లు ఫిదా

పుణే: గుజరాత్‌ లయన్స్‌ విజయం ఖాయమనుకున్న దశలో విజృంభించి అజేయ శతకంతో చెలరేగిన పుణే ఆటగాడు బెన్ స్టోక్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ క్రికెటర్లు అతడి ఆటను కొనియాడుతున్నారు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ వన్ మ్యాన్ షోతో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన పుణే ప్లే ఆఫ్‌ ఆశలను మెరుగుపరుచుకుంది. ఐపీఎల్‌లో రికార్డుస్థాయిలో రూ. 14.5 కోట్ల మొత్తాన్ని దక్కించుకున్న స్టోక్స్ తానెంత విలువైన ఆటగాడో నిరూపించాడు. అతడి ఆటకు పుణేతో పాటు ఐపీఎల్‌లోని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు దాసోహం అయ్యారు.

'జట్టుకు గొప్ప విజయం. స్టోక్స్ బ్యాటింగ్ అద్భుతం. గ్రేట్ సెంచరీ' అని పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ ట్వీట్ చేశాడు. రెండో ఓవర్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎంతో ఒత్తిడిలోనూ స్టోక్స్ ట్వంటీ20 సెంచరీ చేశాడని గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొనియాడాడు. 'ఓ లెఫ్ట్ హ్యాండర్‌గా స్టోక్స్ ఆటను చూడటం గొప్పగా ఉంది. ప్రతిభ ఉన్న క్రికెటర్ అని సీరియస్ ఇన్నింగ్స్ తో ప్రూవ్ చేసుకున్నాడు' అని యువరాజ్ ట్వీట్ చేశాడు. కెవిన్ పీటర్సన్, డుప్లెసిస్ కూడా స్టోక్స్ సెంచరీ చేసిన తీరును ప్రశంసించారు.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. 10 పరుగులకే మూడో వికెట్‌ కోల్పోవడంతో రెండో ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు స్టోక్స్. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన స్టోక్స్ చివర్లో కండరాలు పట్టేసినా పట్టుదలతో ఆడి 61 బంతుల్లో తొలి ఐపీఎల్ సెంచరీని నమోదుచేసి జట్టుకు విజయాన్ని చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement