ధోనీకిదే ఆఖరి సీజన్‌ కావచ్చు | This might be MS Dhoni's last stint in Indian Premier League, feels Ricky Ponting | Sakshi
Sakshi News home page

ధోనీకిదే ఆఖరి సీజన్‌ కావచ్చు

Published Sat, Apr 29 2017 1:58 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

ధోనీకిదే ఆఖరి సీజన్‌ కావచ్చు

ధోనీకిదే ఆఖరి సీజన్‌ కావచ్చు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాడిగా ధోనీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారిని విమర్శిస్తూ, చాంపియన్‌ ఆటగాడి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. కాగా ధోనీ వయసు రీత్యా ఐపీఎల్‌-2017 అతనికి ఆఖరి సీజన్‌ కావచ్చని, వచ్చే ఏడాది ఈ టోర్నీలో ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ కెప్టెన్‌గా ధోనీని తప్పించారు. ఇక బ్యాట్స్‌మన్‌గా ధోనీ నిలకడగా రాణించలేకపోతున్నాడు. దీంతో ధోనీ బ్యాటింగ్‌ సామర్థ్యంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తూ విమర్శించారు. ఈ నేపథ్యంలో పాంటింగ్‌ స్పందిస్తూ.. 'ధోనీ సుదీర్ఘకాలం గొప్ప విజయాలు అందించాడు. ఎన్ని విజయాలు సాధించినా కెరీర్‌లో క్షీణదశ ఉంటుంది. నా కెరీర్‌లోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. నాపైనా విమర్శలు వచ్చాయి. అయితే చాంపియన్‌ ఆటగాళ్లను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడవద్దు' అని అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement