ధోనీకి అండగా నిలిచిన పుణె కెప్టెన్ | Smith not bothered about Dhoni's form | Sakshi
Sakshi News home page

ధోనీకి అండగా నిలిచిన పుణె కెప్టెన్

Published Thu, Apr 13 2017 8:53 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

ధోనీకి అండగా నిలిచిన పుణె కెప్టెన్

ధోనీకి అండగా నిలిచిన పుణె కెప్టెన్

రాజ్‌కోట్‌: ఐపీఎల్‌-2017 సీజన్‌లో బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోతున్న మహేంద్ర సింగ్ ధోనీకి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అండగా నిలిచాడు. ధోనీ ఫామ్‌పై తనకు ఆందోళన లేదని, అతను క్లాస్ ఆటగాడని అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్‌లో తమ జట్టు కేవలం మూడే మ్యాచ్‌లు ఆడిందని,  ఈ టోర్నీమిగతా మ్యాచ్ ల్లో ధోనీ రాణిస్తాడని స్మిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తమకు ధోని బ్యాటింగ్ తో ఎటువంటి ఇబ్బంది లేదని స్మిత్ పేర్కొన్నాడు.

 

తాజా సీజన్‌లో పుణె కెప్టెన్‌గా ధోనీని తొలగించి, అతని స్థానంలో స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. శుక్రవారం గుజరాత్‌ లయన్స్‌తో పుణె తలపడనుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌ తనకు, తమ జట్టుకు నిరాశ కలిగించిందని స్మిత్ అన్నాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగా తాను కడుపు నొప్పితో బాధపడ్డానని, ఇప్పుడు కోలుకున్నానని చెప్పాడు. గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటానని స్మిత్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement