ఐపీఎల్-2023 సీజన్‌లో గత నాలుగు రోజులుగా రసవత్తరమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ నాలుగు మ్యాచ్‌లు చూడకపోయి ఉంటే అది పెద్ద నేరమని సోషల్‌మీడియాలో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. ఆ స్థాయి ఈ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు కావాల్సిన అసలుసిసలు టీ20 మజాను అందించాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ చివరి బంతి వరకు సాగిన ఈ నాలుగు మ్యాచ్‌ల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పైచేయి సాధిస్తే.. చివరి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నారు.
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టుకు సంచలన విజయాన్నందించగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్, పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల సాయంతో లక్నో చివరి బంతికి విజేతగా నిలిచింది. ఆ తర్వాత డీసీతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ముంబై గెలుపుకు కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం కాగా.. నోర్జే అత్యంత పిసినారిగా మారి, మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకొచ్చాడు. ముంబై గెలుపును అడ్డుకునేందుకు నోర్జే చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పొయింది. నోర్జే పోరాటం వృధా అయిన ఫ్యాన్స్‌కు అతని బౌలింగ్ పట్ల గౌరవం పెరిగింది.
దాదాపుగా ఇలాంటి పోరాటమే నిన్న (ఏప్రిల్ 12) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ కూడా చేశాడు. క్రితం మ్యాచ్‌లో నోర్జే లాగా సందీప్ తక్కువ స్కోర్‌ను కాకుండా ఓ మోస్తరు స్కోర్‌ను ఆఖరి ఓవర్‌లో డిఫెండ్ చేసుకుని తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు చేయాల్సి రాగా.. సందీప్ తొలి రెండు బంతులను వైడ్‌లుగా, ఆతర్వాత వరుసగా 2 సిక్సర్లు సమర్పించకుని రాజస్థాన్ ఓటమికి కారకుడయ్యేలా కనిపించాడు.
అయితే ఈ బ్రిలియంట్ బౌలర్ చివరి 3 బంతులు అద్భుతంగా బౌల్ చేసి క్రీజ్‌లో ఉన్న అరివీర భయంకరులైన ధోని, జడేజాలను కట్టడి చేసి (3 బంతుల్లో 3 సింగల్స్), తన జట్టును గెలిపించుకున్నాడు. సందీప్ లాగే దీనికి ముందు మ్యాచ్‌లో నోర్జే కూడా హార్ఢ్ హిట్టర్లు టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్‌లను చివరి బంతి వరకు కట్టడి చేశాడు. అయితే చివరి బంతికి డేవిడ్ 2 పరుగులు సాధించడంతో ముంబై విజయం సాధించింది. మొత్తంగా చూస్తే ప్రస్తుత సీజన్‌లో గత 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో బ్యాటర్ల హవా, ఆఖరి 2 మ్యాచ్‌ల్లో బౌలర్ల డామినేషన్ నడిచింది.
Comments
Please login to add a commentAdd a comment