‘కింగ్స్‌’ బౌలర్‌కు షాక్‌ | Sandeep Sharma fined for showing dissent to umpire's call | Sakshi
Sakshi News home page

‘కింగ్స్‌’ బౌలర్‌కు షాక్‌

Published Mon, May 8 2017 1:50 PM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM

‘కింగ్స్‌’ బౌలర్‌కు షాక్‌ - Sakshi

‘కింగ్స్‌’ బౌలర్‌కు షాక్‌

మొహాలీ: ఐపీఎల్ మ్యాచ్‌లో అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ బౌలర్‌ సందీప్‌ శర్మపై చర్య తీసుకున్నారు. అతడికి మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించారు. సందీప్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. గుజరాత్‌ లయన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ నంద కిశోర్‌తో అతడు వాదులాటకు దిగాడు.

ఇషాన్‌ కిషాన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా తాను వేసిన బంతిని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్‌తో సందీప్‌ వాగ్వాదానికి దిగాడు. అతడికి కింగ్స్‌ కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా తోడయ్యాడు. ఓవర్‌ ముగిసిన తర్వాత అంపైర్‌ చేతిలోని తన క్యాప్‌ను కోపంగా లాక్కుని వెళ్లిపోయాడు సందీప్‌. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలో లెవల్‌వన్‌ అతిక్రమణ కింద మ్యాచ్‌ రిఫరీ అతడిపై చర్య తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement