IPL Code of Conduct
-
KKR VS PBKS: విజయానందంలో ఉన్న కేకేఆర్ కెప్టెన్ భారీ షాక్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరి బంతికి విజయం సాధించి, బతుకు జీవుడా అని బయటపడింది. రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాదడంతో కేకేఆర్ విజయతీరాలకు చేరింది. ఆఖరి ఓవర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో తొలుత ఆందోళన చెందిన కేకేఆర్.. రింకూ సింగ్ బౌండరీ బాదడంతో ఊపిరి పీల్చుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచే విజయం దక్కడం, అలాగే చాలాకాలం తర్వాత తిరిగి ఫామ్‌లోకి రావడంతో సంబురాల్లో మునిగి తేలుతున్న కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు ఐపీఎల్ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ విజయం (20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. చదవండి: PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్ -
RCB VS KKR: డేంజర్ జోన్లో విరాట్ కోహ్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి డేంజర్ జోన్లో ఉన్నాడు. కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 26) జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే, కెప్టెన్‌గా కోహ్లిపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. దీంతో పాటు అతను 30 లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. అలాగే జట్టులోని మిగతా సభ్యులంతా (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతను (రెంటిలో ఏది తక్కువైతే అది) ఎదుర్కోవాల్సి ఉంటుంది. గనుక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దిష్ట సమయంలో (90 నిమిషాల్లో) తమ కోటా ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే దాని ప్రభావం కోహ్లిపై పడుతుంది. ఒకవేళ జట్టు కెప్టెన్‌గా డుప్లెసిస్ ఉన్నా అతనికి కూడా ఇదే వర్తిస్తుంది. (ICC WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ల వెనుక మనోడే) స్లో ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు నిర్దిష్ట సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయకపోతే, తొలిసారి జట్టు కెప్టెన్‌కు 12 లక్షల జరిమానా, రెండో దఫా కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత (ఏది తక్కువైతే అది), మూడోసారి కెప్టెన్‌కు 30 లక్షలతో పాటు ఒక మ్యాచ్ నిషేధం, జట్టు సభ్యులకు 12 లక్షల జరిమానా లేదా 50 శాతం మ్యాచ్ ఫీజ్‌లో కోత (ఏది తక్కువైతే అది) విధించబడుతుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఆర్సీబీ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికతో ఐదో స్థానంలో ఉండగా.. కేకేఆర్7 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో (8) ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. (GT VS MI: ముంబై చెత్త రికార్డు.. గుజరాత్ ఐపీఎల్ రికార్డు) -
విరాట్ కోహ్లికి భారీ జరిమానా
IPL 2023 RCB VS RR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లికి భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2023లో భాగంగా ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు (స్లో ఓవర్ రేట్) ఉల్లంఘించినందుకు గాను, అతనితో పాటు ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ (ఇంపాక్ట్ ప్లేయర్‌తో పాటు) కంతా భారీ జరిమానా పడింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆర్సీబీ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడం రెండోసారి కావడంతో కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం (రెంటిలో ఏది ఎక్కువైతే అది) కోత విధించినట్లు మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ వెల్లడించారు. ఈ పరిస్థితి మరోసారి రిపీట్ అయితే, ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరు ఉన్నా అతనిపై ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రస్తుత ఐపీఎల్లో 24 లక్షల జరిమానా పడిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లినే. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేయగా,. ఛేదనలో తడబడిన ఆర్ఆర్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి, ఓటమిపాలైంది. -
LSG VS RR: విజయానందంలో ఉన్న కేఎల్ రాహుల్‌కు భారీ షాక్
మొహాలీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 19) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఊహించిన ఈ గెలుపును ఎంజాయ్ చేస్తున్న లక్నో టీమ్‌కు ఐపీఎల్ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ అధికారికంగా వెల్లడించింది. చదవండి: కెప్టెన్‌గా ఏదో తప్పు చేసినట్లున్నాను.. అందుకే ఒకటి పీకారు..! కాగా, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా గెలవాల్సింది. అయితే స్వయంకృతాపరాధాల కారణంగా ఆ జట్టు ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖర్లో లక్నో పేసర్ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్‌ను గెలవనీయకుండా చేశాడు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), కైల్ మేయర్స్ (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టోయినిస్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), పూరన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగుల ఓ మోస్తరు స్కోర్ చేసింది. రాయల్స్ బౌలర్లలో బౌల్ట్ (4-1-16-1), సందీప్ శర్మ (4-0-32-1), అశ్విన్ (4-0-23-2), హోల్డర్ (4-0-38-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. అనంతరం బరిలోకి దిగిన రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (41 బంతుల్లో 40; 4 ఫోర్లు, సిక్స్) అదిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆవేశ్ ఖాన్ (4-0-25-3), స్టోయినిస్ (4-0-28-2), నవీన్ ఉల్ హాక్ (4-0-19-0) రాయల్స్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. చదవండి: 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 'ఇలా' తొలిసారి -
Matthew Wade: డ్రెస్సింగ్ రూమ్ వినాశనం; వార్నింగ్‌తో సరి..
గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తాను ఔట్ కాదంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన వేడ్ తన కోపాన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా హెల్మెట్, బ్యాట్‌పై చూపించాడు. వాటిని విసిరేసి.. బ్యాట్‌ను పలుమార్లు నేలకేసి కొడుతూ అసహనం వ్యక్తం చేశాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వినాశనం సృష్టించిన వేడ్‌ను ఐపీఎల్ మేనేజ్మెంట్ హెచ్చరికతో సరిపెట్టింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేసి వేడ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్-1 నిబంధన ఉల్లఘించాడు. అయితే ఎవరిపై తన కోపాన్ని వ్యక్తం చేయకుండా.. కేవలం తన వస్తువులను మాత్రమే నాశనం చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకొని వేడ్‌ది మొదటి తప్పుగా భావిస్తూ హెచ్చరికతో వదిలేస్తున్నామని.. ఎటువంటి జరిమానా విధించడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. PC: IPL Twitter ఈ సీజన్లో మాథ్యూ వేడ్ పెద్దగా రాణించింది లేదు. అసలే సరిగా ఆడడం లేదన్న బాధ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వేడ్‌కు మరింత చికాకు తెప్పించాయి. అందుకే సహనం కోల్పోయిన వేడ్ డ్రెస్సింగ్‌రూమ్‌లో తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆ సమయంలో పక్కన ఎవరైన ఉండి అతను గాయపడితే పరిస్థితి వేరుగా ఉండేదే. ఇక మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన వేడ్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిల్లర్ (25 బంతుల్లో 34; 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (54 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పాత కోహ్లిలా చెలరేగాడు. డుప్లెసిస్ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్ పట్టిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును చకచకా లక్ష్యానికి చేర్చాడు. చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్ pic.twitter.com/IOmnppKBWb — Cred Bounty (@credbounty) May 19, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘కింగ్స్’ బౌలర్‌కు షాక్.
-
‘కింగ్స్’ బౌలర్‌కు షాక్
మొహాలీ: ఐపీఎల్ మ్యాచ్‌లో అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బౌలర్ సందీప్ శర్మపై చర్య తీసుకున్నారు. అతడికి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. సందీప్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. గుజరాత్ లయన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ నంద కిశోర్‌తో అతడు వాదులాటకు దిగాడు. ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ చేస్తుండగా తాను వేసిన బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్‌తో సందీప్ వాగ్వాదానికి దిగాడు. అతడికి కింగ్స్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ కూడా తోడయ్యాడు. ఓవర్ ముగిసిన తర్వాత అంపైర్ చేతిలోని తన క్యాప్‌ను కోపంగా లాక్కుని వెళ్లిపోయాడు సందీప్. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలో లెవల్వన్ అతిక్రమణ కింద మ్యాచ్ రిఫరీ అతడిపై చర్య తీసుకున్నారు. -
ఒకరికి జరిమానా, మరొకరికి వార్నింగ్
హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కు జరిమానా విధించారు. ఐపీఎల్ నిబంధనలు ఉల్లఘించినందుకు అతడిపై మ్యాచ్ రిఫరీ ఈ చర్య తీసుకున్నారు. మరో బ్యాట్స్ మన్ షాన్ మార్ష్ కు అధికారికంగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు మందలించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ మైదానంలో అతిగా ప్రవర్తించినట్టు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మార్ష్ 40 పరుగులు సాధించాడు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది.