photo credit: IPL Twitter
మొహాలీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 19) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఊహించిన ఈ గెలుపును ఎంజాయ్ చేస్తున్న లక్నో టీమ్‌కు ఐపీఎల్ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ అధికారికంగా వెల్లడించింది.
చదవండి: కెప్టెన్‌గా ఏదో తప్పు చేసినట్లున్నాను.. అందుకే ఒకటి పీకారు..!
కాగా, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా గెలవాల్సింది. అయితే స్వయంకృతాపరాధాల కారణంగా ఆ జట్టు ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖర్లో లక్నో పేసర్ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్‌ను గెలవనీయకుండా చేశాడు.
మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), కైల్ మేయర్స్ (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టోయినిస్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), పూరన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగుల ఓ మోస్తరు స్కోర్ చేసింది. రాయల్స్ బౌలర్లలో బౌల్ట్ (4-1-16-1), సందీప్ శర్మ (4-0-32-1), అశ్విన్ (4-0-23-2), హోల్డర్ (4-0-38-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
అనంతరం బరిలోకి దిగిన రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (41 బంతుల్లో 40; 4 ఫోర్లు, సిక్స్) అదిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆవేశ్ ఖాన్ (4-0-25-3), స్టోయినిస్ (4-0-28-2), నవీన్ ఉల్ హాక్ (4-0-19-0) రాయల్స్‌ను దారుణంగా దెబ్బకొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment