ఐపీఎల్-2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 19) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా గెలవాల్సింది. అయితే స్వయంకృతాపరాధాల కారణంగా ఆ జట్టు ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖర్లో లక్నో పేసర్ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్‌ను గెలవనీయకుండా చేశాడు.
చదవండి: సారీ బ్రో.. నీలో ఇంత టాలెంట్ ఉందా? అస్సలు ఊహించలేదు
మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), కైల్ మేయర్స్ (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టోయినిస్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), పూరన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగుల ఓ మోస్తరు స్కోర్ చేసింది. రాయల్స్ బౌలర్లలో బౌల్ట్ (4-1-16-1), సందీప్ శర్మ (4-0-32-1), అశ్విన్ (4-0-23-2), హోల్డర్ (4-0-38-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
అనంతరం బరిలోకి దిగిన రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (41 బంతుల్లో 40; 4 ఫోర్లు, సిక్స్) అదిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆవేశ్ ఖాన్ (4-0-25-3), స్టోయినిస్ (4-0-28-2), నవీన్ ఉల్ హాక్ (4-0-19-0) రాయల్స్‌ను దారుణంగా దెబ్బకొట్టారు.
కెప్టెన్‌గా ఏదో తప్పు చేసినట్లున్నాను.. అందుకే బాల్‌తో ఒకటి పీకారు..
మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫన్నీగా చేసిన ఓ స్టేట్‌మెంట్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ రాహుల్ ఏమాన్నడంటే.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచరుల విసిరిన ఓ త్రో కారణంగా నా మోచేతికి స్వల్ప గాయమైంది. దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ సమయంలో నాకు ఒక్క విషయం స్పష్టమైంది. కెప్టెన్‌గా నేను ఏదో తప్పు చేస్తున్నట్లున్నాను, అందుకే సహచరులు తనను బంతితో ఒకటి పీకి అలర్ట్ చేసినట్లున్నారు అని నవ్వుతూ చెప్పాడు.
రాహుల్ సరదాగా చేసిన ఈ కామెంట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజమే రాహుల్‌కు ఇలా ఒకటి పీకి చెబితే కాని బుర్రకెక్కదు అని అంటున్నారు. ఇంకొందరేమో రాహుల్ రానురాను జిడ్డు బ్యాటింగ్‌తో తెగ విసిగించేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఏదో బౌలర్ల పుణ్యమా అని బయటపడ్డారు, లేకపోతే ఇలాంటి ఫన్నీ స్టేట్‌మెంట్‌లు ఇచ్చే వారా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
చదవండి: చేతులేత్తేసిన బ్యాటర్లు.. రాజస్తాన్ బోల్తా.. 10 పరుగులతో లక్నో విజయం
Comments
Please login to add a commentAdd a comment