Photo Credit: IPL Twitter
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 26) జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే, కెప్టెన్‌గా కోహ్లిపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. దీంతో పాటు అతను 30 లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది.
అలాగే జట్టులోని మిగతా సభ్యులంతా (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతను (రెంటిలో ఏది తక్కువైతే అది) ఎదుర్కోవాల్సి ఉంటుంది. గనుక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దిష్ట సమయంలో (90 నిమిషాల్లో) తమ కోటా ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే దాని ప్రభావం కోహ్లిపై పడుతుంది. ఒకవేళ జట్టు కెప్టెన్‌గా డుప్లెసిస్ ఉన్నా అతనికి కూడా ఇదే వర్తిస్తుంది.
(ICC WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వికెట్ల వెనుక మనోడే)
స్లో ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు నిర్దిష్ట సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయకపోతే, తొలిసారి జట్టు కెప్టెన్‌కు 12 లక్షల జరిమానా, రెండో దఫా కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత (ఏది తక్కువైతే అది), మూడోసారి కెప్టెన్‌కు 30 లక్షలతో పాటు ఒక మ్యాచ్ నిషేధం, జట్టు సభ్యులకు 12 లక్షల జరిమానా లేదా 50 శాతం మ్యాచ్ ఫీజ్‌లో కోత (ఏది తక్కువైతే అది) విధించబడుతుంది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఆర్సీబీ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికతో ఐదో స్థానంలో ఉండగా.. కేకేఆర్7 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో (8) ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
(GT VS MI: ముంబై చెత్త రికార్డు.. గుజరాత్ ఐపీఎల్ రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment