PC: IPL Twitter
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్రస్తానం నిన్నటితో (మే 21) ముగిసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఆ జట్టు కుంగుబాటుతో లీగ్ నుంచి నిష్క్రమించింది. విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో తప్పక గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడింది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై శుభ్‌మన్ గిల్ నీళ్లు చల్లాడు. ఫలితంగా ఆర్సీబీ ఇంటికి, ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాయి. ఆర్సీబీ.. ఈ ఏడాది కూడా టైటిల్ గెలవకుండా నిరాశగా వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.
సీజన్ ప్రారంభానికి ముందు ఓ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ "ఈ ఏడాది కప్ లేదు" అని అన్నాడు. ఆర్సీబీ స్లోగన్ "ఈ సాల కప్ నమ్దే"ను డుప్లెసిస్ పొరపాటున "ఈ సాల కప్ నహీ" అని ఉచ్ఛరించాడు. దీంతో పక్కనే ఉన్న కోహ్లి.. డుప్లెసిస్ చేసిన తప్పును నవ్వుతూ సరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు ఆర్సీబీకి, ఆ జట్టు అభిమానులకు ట్యాగ్ చేస్తూ సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆర్సీబీ ఈ ఏడాది కూడా టైటిల్ గెలవదని డుప్లెసిస్‌కు ముందే తెలుసని కామెంట్లు చేస్తున్నారు. కొందరు సరదాగా ఈ వీడియోను షేర్ చేస్తుంటే, కొందరేమో ఆర్సీబీ ఓటమిని తమాషా చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు.
Even Faf Knows Ee Sala Cup Nahi 😂😂😂😂🙊😂😂😂😂#RCB
— Dr Khushboo 🇮🇳 (@khushbookadri) April 1, 2023
pic.twitter.com/ZRu3moy66X
తమ జట్టుపై అనవసర ట్రోలింగ్‌కు దిగుతున్న వారికి ఆర్సీబీ అభిమానులు సైతం ధీటైన సమాధానాలతో బదులిస్తున్నారు. ఆర్సీబీ ఎప్పటికీ టైటిల్ గెలవలేకపోయిన మేము వారితోనే ఉంటామని, కింగ్ కోహ్లి ఎప్పటికీ కింగేనని, డుప్లెసిస్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని హేళన చేస్తే క్రికెట్ అభిమానులు క్షమించరని కౌంటర్లిస్తున్నారు.
కాగా, గుజరాత్ టైటాన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వీరోచిత శతకం వృధా అయ్యింది. శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్‌ను గెలిపించాడు. ఆర్సీబీ ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్-సీఎస్‌కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment