photo credit: IPL Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన నాటి నుండి 'ఈ సాలా కప్ నమదే'.. ఈ సాలా కప్ నమదే అంటూ ఆర్సీబీ అభిమానులు హడావుడి చేయడం చూస్తూనే ఉన్నాం. 15 సీజన్లు అయిపోయినా ఆ జట్టు ఇంతవరకు ఒక్క టైటిల్ కూడా సాధించింది లేదు కానీ, ఆ జపం మాత్రం వదలడం లేదు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కు చేరినా ఆర్సీబీకి అదృష్టం కలిసి రాలేదు. ప్రస్తుత సీజన్‌లోనూ ఆర్సీబీ అభిమానులు అదే స్లోగన్ చెప్తూ ఊదరగొడుతున్నారు.
ప్రస్తుత సీజన్‌లో వారికి అశించిన ఫలితాలు రాకపోయినా, చెత్త జట్టుతో (KGFS (కోహ్లి,మ్యాక్సీ, డుప్లెసిస్,సిరాజ్) మినహా) అతి కష్టం మీద నెట్టుకొస్తున్నా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఈ సాలా కప్ నమదే అని ధీమాగా చెబుతున్నారు. పైగా నిన్న (మే 1) లక్నోపై విజయానంతరం వారి వాయిస్‌లో బేస్ పెరిగింది. ఈ సాలా కప్ నమదే అంటూ ఇంకా గట్టిగా వాదిస్తున్నారు. వారి కాన్ఫిడెన్స్‌కు కారణం ఏంటని ఆరా తీస్తే.. చాలామంది ఓ ఆటగాడి పేరు చెబుతున్నారు. అతడే ఆర్సీబీ వెటరన్ స్పిన్నర్ కర్ణ్ శర్మ.
కర్ణ్ శర్మ ఎక్కడ ఉంటే ఆ జట్టు టైటిల్ గెలవడం మనం చూశాం. ఇతగాడు 2016 (సన్‌రైజర్స్ హైదరాబాద్), 2017 (ముంబై ఇండియన్స్), 2018 (సీఎస్‌కే), 2021 (సీఎస్‌కే) సీజన్లలో వివిధ విన్నింగ్ టీమ్‌లలో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కర్ణ్ శర్మను మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్‌గా పేరుంది. ఆర్సీబీ అభిమానులు ప్రస్తుతం కర్ణ్ శర్మ సెంటిమెంట్ పైనే గంపెడాశలు పెట్టుకున్నారు. పైగా ప్రత్యర్ధులు ఈ ఏడాది తమను తక్కువ అంచనా వేయడం కూడా కలిసొస్తుందని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఉన్న ఆర్సీబీ.. తదుపరి మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి, ఆ తర్వాత టైటిల్ కూడా సాధించి తీరుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సాలా కప్ నమదే.. రాసి పెట్టుకోండి అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ వ్యతిరేకులు మాత్రం ఆర్సీబీకి అంత సీన్ లేదని, కర్ణ్ శర్మ గతేడాది కూడా వారితోనే ఉన్నాడు, అప్పుడు కానిది ఇప్పుడెలా కుదురుతుందని పంచ్‌లు వేస్తున్నారు.
మరికొందరైతే దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లాంటి దిగ్గజాలను జట్టులో ఉంచుకుని టైటిల్ సాధించాలనుకోవడం అత్యాశే అవుతుందని సెటైర్లు వేస్తున్నారు. మరి ఫ్యాన్స్ నమ్మకాన్ని ఆర్సీబీ నీలబెడుతుందో, నీరుగారుస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment