బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (రాత్రి 7:30) అత్యంత కీలక సమరం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో లోకల్ టీమ్ ఆర్సీబీ.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది. ఇలాంటి కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీని ఓ అంశం తీవ్రంగా కలవరపెడుతుంది.
ఈ మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ సమయానికి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని యాక్యూ వెదర్ చూపిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోయినా లేక ఆటంకం కలిగినా ఆర్సీబీ తీవ్ర నష్టంగా పరిగణించబడుతుంది. మ్యాచ్ రద్దైతే ఆర్సీబీ, గుజరాత్‌లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.
అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ఇది జరిగి, సన్‌రైజర్స్‌పై ముంబై గెలిస్తే.. ఆ జట్టు 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సమీకరణల నేపథ్యంలో నేటి మ్యాచ్ వరుణుడు ఆటంకం లేకుండా సాగాలని ఆర్సీబీ అభిమానులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కాగా, గుజరాత్ (18),సీఎస్‌కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2023 కీలక దశకు చేరిన తరుణంలో ఆర్సీబీ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాటర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఓ రేంజ్‌లో ఇరగదీస్తున్నారు. గత మ్యాచ్‌లో విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, బ్రేస్‌వెల్ రాణిస్తున్నారు. బౌలింగ్‌లో సిరాజ్, పార్నెల్, హసరంగ, హాజిల్‌వుడ్ పర్వాలేదనిపిస్తున్నారు. వర్షం నుంచి ఎలాంటి ఆటంకం కలగకపోతే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఆర్సీబీ.. గెలిచి నిలుస్తుందా లేక ఓడి నిష్క్రమిస్తుందా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి.
చదవండి: MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్‌కు ‘లాస్ట్’ ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment