ఒకరికి జరిమానా, మరొకరికి వార్నింగ్
హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కు జరిమానా విధించారు. ఐపీఎల్ నిబంధనలు ఉల్లఘించినందుకు అతడిపై మ్యాచ్ రిఫరీ ఈ చర్య తీసుకున్నారు. మరో బ్యాట్స్ మన్ షాన్ మార్ష్ కు అధికారికంగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు మందలించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ మైదానంలో అతిగా ప్రవర్తించినట్టు మ్యాచ్ రిఫరీ గుర్తించారు.
ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మార్ష్ 40 పరుగులు సాధించాడు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది.