IPL 2023: Sandeep Sharma's daughter enjoys her father's final-over heroics against CSK - Sakshi
Sakshi News home page

Sandeep Sharma: తండ్రి బౌలింగ్‌ చూసి కేరింతలు కొట్టిన కూతురు

Published Thu, Apr 13 2023 5:50 PM | Last Updated on Thu, Apr 13 2023 6:01 PM

IPL 2023-Sandeep Sharma Daughter Enjoy Father final-over heroics Vs CSK - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో బుధవారం సీఎస్‌కే, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు అవసరమైన దశలో సీఎస్‌కే కెప్టెన్‌ ధోని రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను చెన్నైవైపు మొగ్గాడు. దీంతో సీఎస్‌కే విజయం సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సందీప్‌ శర్మ ఒత్తిడిని జయించి చివరి మూడు బంతులను అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో సీఎస్‌కే విజయానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది.దీంతో రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే సందీప్‌ శర్మ బౌలింగ్‌ను టీవీలో చూసి ఎంజాయ్‌ చేసింది అతని పది నెలల కూతురు. ఆఖరి ఓవర్లో ధోనీ, జడేజా లాంటి హిట్టర్లకు సందీప్ శర్మ బౌలింగ్ చేస్తుండగా.. నెలల వయసున్న అతడి కూతురు తల్లి ఒడిలో కూర్చొని టీవీలో మ్యాచ్ చూసింది. తండ్రిని గుర్తుపట్టిన ఆ చిన్నారి చిరునవ్వులు చిందింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ జట్ల తరఫున ఆడిన సందీప్ శర్మ.. 2021 ఆగస్టులో తన గర్ల్ ఫ్రెండ్ తషా సాత్విక్‌ను పెళ్లాడాడు. గత ఏడాది జూన్ 20న వారికి కుమార్తె జన్మించింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సందీప్ శర్మ పట్ల ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కానీ గాయపడిన ప్రసిధ్ కృష్ణ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ సందీప్ శర్మను జట్టులోకి తీసుకుంది.

పది సీజన్ల అనుభవం.. 100కుపైగా వికెట్లు తీసిన బౌలర్‌ను రాజస్థాన్ రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కే సొంతం చేసుకుంది. యార్కర్లు సంధించడంలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించే సందీప్ శర్మ.. ఐపీఎల్‌లో 106 మ్యాచ్‌ల్లో 116 వికెట్లు తీశాడు. గతంలో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో భువీతో కలిసి కీలకంగా వ్యవహరించాడు.

చదవండి: IPL 2023: మొన్న నోర్జే, నిన్న సందీప్‌ శర్మ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement