
పాటియాలా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సందీప్ శర్మ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు తన కాబోయే భార్య దిగిన ఫొటోను సందీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పేరు తాషా సాత్విక్‌గా సందీప్ తెలిపాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాషా.. తరచుగా సందీప్‌ను అభినందిస్తూ ట్వీట్లు చేస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. గతంలో కింగ్స్ పంజాబ్ తరపున సందీప్ ఆడే క‍్రమంలో.. తాషా తన ప్రేమను వ్యక్త పరిచినట్లు సమాచారం. అందుకు సందీప్ కూడా అంగీకారం తెలపడంతో ఎట్టకేలకు ఈ జంట కలిసి జీవితాన్ని పంచుకునేందుకు మార్గం సుగమైంది. గతేడాది వరకు కింగ్స్ ఎలెవన్ తరఫున సత్తా చాటిన సందీప్ శర్మ.. ఈ సీజన్ సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment