IND VS IRE T20 Series 2022: హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యంగ్ ఇండియా జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. డబ్లిన్ వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
పొట్టి ఫార్మాట్‌లో ఇండియాతో ఐర్లాండ్ గత రికార్డులను పరిశీలిస్తే.. ఈ రెండు జట్లు తలపడిన 3 సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది. ఇరు జట్లు తొలిసారి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2009లో తలపడగా.. టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
18 ఓవర్లకు కుదించిన నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేయగా.. ఛేదనలో టీమిండియా మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 3 ఓవర్లలో 19 పరుగులిచ్చి ఐర్లాండ్‌ను కట్టడి చేసిన జహీర్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) అజేయమైన హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2018లో డబ్లిన్ (మలహిదే) వేదికగా జరిగిన 2 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఆ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టీ20లో రికార్డు స్థాయిలో 143 పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయం నమోదు చేసింది.
తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (97), శిఖర్ ధవన్ (74) బ్యాట్‌తో.. కుల్దీప్ యాదవ్ (4/21), చహల్ (3/38), బుమ్రా (2/19) బంతితో చెలరేగారు.
ఈ సిరీస్‌లో జరిగిన రెండో టీ20లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఐర్లాండ్ 70 పరుగులకే చాపచుట్టేసింది. కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 70), సురేశ్ రైనా (45 బంతుల్లో 69), హార్ధిక్ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ (3/16), చహల్ (3/21) ఐర్లాండ్‌ను తిప్పేశారు.
ఐర్లాండ్‌తో సిరీస్‌కు టీమిండియా: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి.
ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), హ్యారీ టెక్టార్, గరేత్ డిలనీ, పాల్ స్టిర్లింగ్, కర్టిస్ కాంఫర్, స్టీఫెన్ డోహ్నీ, లోర్కాన్ టకర్, మార్క్ అడేర్, జార్జ్ డాక్రెల్, జాషువా లిటిల్, ఆండీ మెక్‌బ్రిన్, బ్యారీ మెకార్టీ, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్.
చదవండి: India Vs Ireland: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఈ వివరాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment