2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల టీమిండియా విండీస్ పర్యటన నిన్నటితో (ఆగస్ట్ 13) ముగిసింది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భారత్ టెస్ట్ (1-0), వన్డే సిరీస్‌లు (2-1) నెగ్గగా.. విండీస్ టీ20 సిరీస్ (3-2) కైవసం చేసుకుంది. ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన ఆఖరి టీ20 అనంతరం ఆరు మందితో (యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్) కూడిన భారత జట్టు ఇక్కడి నుంచి నేరుగా ఐర్లాండ్‌కు పయనం కాగా.. మిగతా తొమ్మిది మంది భారత్ నుంచి బయల్దేరతారు.
ఐర్లాండ్ పర్యటనలో భారత్ ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు ఆడుతుంది. ఈ జట్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతనికి డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు డబ్లిన్‌లోని ద విలేజ్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ జియో సినిమా యాప్‌తో పాటు స్పోర్ట్స్18లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వోర్కోమ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్
ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment