Ind Vs Ire 2nd T20I: Deepak Hooda Was 4th Indian Player To Hit T20 Century - Sakshi
Sakshi News home page

Deepak Hooda Century: దీపక్‌ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా

Published Tue, Jun 28 2022 10:47 PM | Last Updated on Wed, Jun 29 2022 10:19 AM

Deepak Hooda Was 4th Team India Player T20 Century IND vs IRE - Sakshi

ఐర్లాండ్‌తో రెండో టి20లో టీమిండియా ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా సెంచరీతో చెలరేగాడు. తొలి టి20లో భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన దీపక్‌ హుడా రెండో టి20లో ఏకంగా శతకంతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీపక్‌ హుడాకు ఓపెనర్‌ సంజూ శాంసన్‌(42 బంతుల్లో 77, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సహకరించాడు. కాగా దీపక్‌ హుడాకు టి20ల్లో ఇదే తొలి సెంచరీ.

ఇక టీమిండియా తరపున టి20ల్లో సెంచరీ బాదిన నాలుగో భారత ఆటగాడిగా దీపక్‌ హుడా నిలిచాడు. ఇంతకముందు టి20ల్లో రోహిత్‌ శర్మ(4 సెంచరీలు), కేఎల్‌ రాహుల్‌(2 సెంచరీలు), సురేశ్‌ రైనా.. తాజాగా దీపక్‌ హుడా వీరి సరసన చేరాడు. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement