
డబ్లిన్ వేదికగా ఆదివారం ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లంతా దూరం కావడంతో.. హార్ధిక్ పాండ్యా సారథ్యంలో జూనియర్ భారత జట్టు బరిలోకి దిగనుంది. తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో హార్థిక్ పాండ్యా మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు భారత తరపున అరంగేట్రం చేయబోతున్నారంటూ పాండ్యా సూచించాడు. కాగా తొలి టీ20లో ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి అంతర్జాతీయ అరంగేట్రం చేయున్నట్లు తెలుస్తోంది.
"మేము ఈ మ్యాచ్‌లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము. అదే విధంగా అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నాము. ప్రస్తుత జట్టు పరిస్థితుల బట్టి ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఈ సిరీస్‌లో మంచి ఫలితాన్ని తీసుకురావడంపై నా దృష్టంతా ఉంది" అని హార్ధిక్ పాండ్యా పేర్కొన్నాడు.
చదవండి: West Indies New captain: వెస్టిండీస్ కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్..